వరుస విజయాలతో మంచి దూకుడు మీద ఉన్న నిఖిల్ కు.. స్పై సినిమా బ్రేకులేసింది. దాంతో జోరు కాస్త తగ్గిపోయంది. ప్రస్తుతం ఆలోచనలో పడ్డాడు నిఖిల్. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్న ఈ యంగ్ హీరో.. కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పరుగులు ఆపి.. సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఫిక్స్ అయ్యాడట.  

మొదటి నుంచి కూడా నిఖిల్ తనరేంజ్ ను పెంచే సినిమాలనే చేస్తూ వెళుతున్నాడు. కొత్త కంటెంట్ తో ప్రయోగాలు చేస్తూ..డిఫరెంట్ గా కనిపించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన 'కార్తికేయ 2' ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత వచ్చిన 'స్పై' మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఇక గతంలో కార్తికేయా 2 ఇచ్చిన ఉత్సాహంతో.. వరుసగా సినిమాలు లైన్ అప్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం రామ్ వంశీకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాకి 'ది ఇండియా హౌస్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక మరో వైపు 'స్వయంభూ టైటిల్ తో మరో సినిమా కూడా నిఖిల్ ఖాతోలో ఉంది. ఆ సినిమాను కూడా ఆయన పూర్తిచేసే పనిలో ఉన్నాడు. రెండు సినిమాలు సైమల్ టైనస్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ఇక స్వయంభూ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నా. ఈసినిమా కూడా నిఖిల్ కెరీర్ లో ప్రయోగాత్మక సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఈమూవీలో నిఖిల్ యుద్ధవీరుడిగా కనిపించబోతున్నాడు. 

ఈ రెండు సినిమాలు కాకుండా ముచ్చటగా మూడో సినిమా కూడా లైన్ లో పెట్టాడు నిఖిల్. అఫీషియల్ గా పెద్దగా బయటకు రాకపోయినా.. నిఖిల్ మరో ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ ఎక్కించినట్టు తెలుస్తోంది. గతంలో నిఖిల్ తో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారట. వీఐ ఆనంద్ కథలు .. కాన్సెప్టులు డిఫరెంట్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే ఈ సారి వీరిద్దరు కలిసి ఏం యాయ చూయబోతున్నారో చూడాలి.