Asianet News TeluguAsianet News Telugu

హీరో కార్తికేయ ఎక్కడో మిస్సింగ్, పెళ్లితరువాత కనిపించడం మానేసిన యంగ్ స్టార్..

కార్తికేయ ఎక్కడ..? కార్తికేయ ఎక్కడా..? టాలీవుడ్ ఆడియన్స్ వెతుకుతున్నారు. ఈ యంగ్ హీరో ఎక్కడికి వెళ్లిపోయాడు. అసలు సినిమాలు చేస్తున్నారా..? షూటింగ్స్ లో కనిపించిన జడలేదే అని వెతుకుతున్నారు. ఇంతకీ కార్తికేయా ఎక్కడికెళ్ళినట్టు..? 
 

Tollywood Young Hero Karthikeya Missing
Author
Hyderabad, First Published Jul 3, 2022, 1:02 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎక్కడో మాయమైపోయాడు. ఈ మధ్య అస్సలు కనిపించడంలేదు. ముఖ్యంగా కార్తికేయ పెళ్ళి తరువాత అసలు జాడే లేకుండా పోయాడు.   ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ స్టార్.. యూత్ కు బాగ కనెక్ట్ అయ్యాడు. యూత్ లోనే కాదు .. మాస్ ఆడియన్స్ లోను ఆయనకి ఆ సినిమా మంచి క్రేజ్ వచ్చింది. ఇదంతా ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమాతోనే వచ్చింది. 

ఇక కార్తికేయ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. కాని కార్తికేయకు ఆర్ ఎక్స్ 100 తరువాత అంతలా సాలిడ్ హిట్ పడేలేదు ఇంత వరకూ.. దాదాపు అన్ని సినిమాలు యావరేజ్ అనిపించుకున్నాయి. కాని కార్తికేయకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, వాలిమై లాంటి సినిమాల్లో పవర్ ఫుల్,గ్లామర్ విలన్ గా ఆడియన్స్ ను మెప్పించాడీ హీరో. 

చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్ లు ఎంచుకున్నా.. విభిన్నమైన సినిమాలు కూడా చేసినా..పెద్ద బ్యానర్లలో ప్రాజెక్ట్ లు చేసినా..  ఆ సినిమాలు కూడా కార్తికేయను నిరాశపరిచాయి. దాంతో నానీస్  గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన,  ఏకంగా తమిళ తెరపై అజిత్ తో తలపడ్డాడు. తన పర్సనాలిటీతో కోలీవుడ్ ఆడియన్స్ ను  మెప్పించాడు. 

అయితే వాలిమై సినిమా కూడా  తమిళంలో తప్ప, మిగతా భాషల్లో అస్సలు ప్రభావాన్ని చూపించలేకపోయింది.  కాని తమిళంలో మాత్రం కార్తికేయకు మంచి ఇమేజ్ వచ్చింది.. ఫ్యాన్స్ కూడా తయారయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వాలిమై సినిమా తరువాత కార్తికేయ ఏదో సినిమా చేస్తున్నట్టుగా  చెప్పాడు గానీ, ఆ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నాడనేది తెలియడం లేదు. 

ముఖ్యంగా ఆమధ్య ఈ యంగ్ హీరో తన స్నేహితురాలిని పెళ్ళాడాడు. పెళ్ళి తరువాత ఈ హీరో బయట ఎక్కడా కనిపించలేదు. సినిమా అప్ డేట్స్ కూడా లేవు.  తన తోటి హీరోల సినిమా ఫంక్షన్స్ లో స్టేజ్ పై అప్పుడప్పుడు  సందడి చేసే కార్తికేయ..  ఈ మధ్య కనిపించకపోవడంతో  అందరూ.. ఆశ్చర్యం వ్యాక్తం చేస్తున్నారు. భార్యతోకలసి ఫారెన్ ఏమైనా వెళ్లాడా.. లేకుండే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడా..? లేక కొత్తగా పెళ్ళైయింది కదా..ఫ్యామిలీకి టైమ్ కేటాయించాడా..? అంటూ.. రకరకాలు మాటలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios