టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడిగా ఎదగాలని కలలు కన్న యువ దర్శకుడు పైడి రమేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. 

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడిగా ఎదగాలని కలలు కన్న యువ దర్శకుడు పైడి రమేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. యుదాఫ్ గూడలో ఓ భవనంలో ఉంటున్న పైడి రమేష్ అక్కడి నుంచి పడడంతో స్పాట్ లోనే మృతి చెందారు. పైడి రమేష్ 2018లో 'రూల్' అనే సినిమా తెరకెక్కించారు. 

నూతన నటీనటులు నటించిన ఆ చిత్రం అంతగా గుర్తింపు పొందలేదు. దీనితో పైడి రమేష్ మరో అవకాశం కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది. రమేష్ జీవితం అర్థాంతరంగా నిలిచిపోయింది. స్థానికులు చెబుతున్న సమాచారం మేరకు రమేష్ సాయంత్రం వాకింగ్ కి వెళ్లి వచ్చాడు. అతడు నివాసం ఉంటున్న రూమ్ నాలుగో అంతస్తులో ఉంది. 

సాయంత్రం వర్షం మొదలు కావడంతో బాల్కనీలో ఉన్న బట్టలు తీయడం ప్రారంభించాడు. కొన్ని బట్టలు భవనానికి దగ్గరగా ఉన్న తీగలపై పడ్డాయి. రమేష్ వాటిని తేలిగ్గా తీసుకుని ఓ రాడ్ సాయంతో బట్టలు తీసే ప్రయత్నం చేశాడు. దీనితో కరెంట్ షాక్ కొట్టి భవనం నుంచి కింద పడ్డాడు. నాలుగో అంతస్తు నుంచి పడడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. 

ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ ఇలా మృతి చెందడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.