ఒకప్పుడు విలన్‌గా తెలుగులో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు దేవరాజ్‌.  కన్నడలో వందల సినిమాలు చేసిన దేవరాజ్‌ ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. 

ఒకప్పుడు విలన్‌గా తెలుగులో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు దేవరాజ్‌. `ప్రేమ యుద్ధం`, `నేటి సిద్ధార్థ`, `ఎర్ర మందారం`, `బంగారు బుల్లోడు`, `ఎస్పీ పరశురామ్‌`, `అన్నా`, `సమరసింహారెడ్డి`, `యజ్ఞం`, `ఎవడైతే నాకేంటి` చిత్రాలతో విలన్‌గా మెప్పించారు. ముఖ్యంగా `ఎర్రమందారం` విలన్‌గా ఆయనకు విశేషం గుర్తింపు తెచ్చింది. దాదాపు పదిహేను సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. చివరగా ఆయన మహేష్‌ `భరత్‌ అనే నేను` చిత్రంలో నటించారు. 

కన్నడలో వందల సినిమాలు చేసిన దేవరాజ్‌ ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. `వైరం` అనే సినిమాతో కుమారుడు ప్రణమ్‌ దేవరాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతుంది. తాజాగా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని పంచుకున్నారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అయితే తొలి చిత్రంతోనే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చేయబోతున్నట్టు పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ సాయి శివన్ జంపన దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనుంది ‘వైరం’ టీమ్.! కాగా, ఫస్ట్ లుక్‌లో.. నెంబర్ ప్లేట్ మీదున్న ‘నంబర్’ ఒకింత ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది. కారణమేంటంటే, ఆ నెంబర్స్ ‘రామ్’ని తలపిస్తుండడం. హిందీలో ‘ర’ అక్షరాన్ని నెంబర్ ‘2’గా చూపిస్తూ, రెండు ‘1’ నెంబర్లను పేర్కొంటూ, ‘4’ నెంబర్‌ని ‘మ’ అక్షరాన్ని పోలి వుండేలా ప్రస్తావించారు. పోస్టర్‌లోని ఈ అంశం సంచలనంగా మారే అవకాశం వుంది. ఈ చిత్రానికి జె.మల్లికార్జున నిర్మాత కాగా, సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు. మహతీ స్వర సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.

ఈ సినిమా గురించి టీమ్‌ చెబుతూ, `రామ్.! జై శ్రీరామ్.! ఈ మాట సినిమాల సక్సెస్ మంత్రం అయిపోయింది.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి అందులో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపిస్తే, దాన్ని శ్రీరాముడి పాత్రగా నార్త్ ఆడియన్స్ తీసుకున్నారు! చాలా సినిమాలు ‘జై శ్రీరామ్’ సెంటిమెంట్‌తో ఇటీవలి కాలంలో మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా ‘రామ్’ అంటూ ‘వైరం’ సినిమా తొలి పోస్టర్‌ని వదిలారు. ప్రముఖ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వైరం’ సినిమా విడుదలకు సిద్ధమైంద`ని పేర్కొంది యూనిట్‌.