Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి ఇంటి లాన్ లో పడిబొర్లాడిన ముగ్గరు హీరోలు ఎవరు..?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆ ముగ్గరు టాలీవుడ్ యంగ్ హీరోలు.. లాన్ లో పడిదొర్లుతున్నారట. ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరు..? ఎందుకు దొర్లుతున్నారు..? 
 

Tollywood Three Young Heroes In Megastar Chiranjeevi House Lane  JMS
Author
First Published Feb 9, 2024, 2:22 PM IST | Last Updated Feb 9, 2024, 2:22 PM IST

మంచు మనోజ్ హోస్ట్ గా మారి చేస్తున్న ప్రోగ్రామ్ గా ఈ విన్ యాప్ లో ఉస్తాద్ అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇప్పటికే 8 ఎపిసోడ్స్  స్ట్రీమింగ్ అవ్వగా.. అన్నింటిని అద్భుతంగా ఆదరించారు ప్రేక్షకులు కాగా ఇప్పటి వరకూ ఈ షోనకు రానా, రవితేజ, తేజ సజ్జ.. ఇలా పలువురు సినీ సెలబ్రిటీలు వచ్చి ఉస్తాద్ షోలో సందడి చేశారు. ఇక వారి నుంచి  బోలెడన్ని ఆసక్తికర విషయాలు రాబట్టాడు మంచు మనోజ్.  మంచువారి హీరో కూడా అల్లరి చేస్తూ.. వారిచేత చేయిస్తూ.. సందడి చేస్తూ వస్తున్నాడు. 

ఇక ఈసారి తాజా ఎపిసోడ్ కు సబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో యంగ్ హీరో శర్వానంద్ నెక్ట్స్ ఎపిసోడ్ లో సందడి చేయబోతున్నాడు. ప్రోమోలో  ఉస్తాద్ షోలో శర్వానంద్ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. శర్వా ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా ఇందులో చరణ్ గురించి యంగ్ హీరో చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.

శర్వానంద్, రానా, రామ్ చరణ్ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. అయితే వీరి  గ్యాంగ్ లో మంచు మనోజ్ కూడా ఉన్నాడని తాజా ఎపిసోడ్ ద్వారా ఆడియన్స్ కు తెలుస్తోంది. శర్వానంద్, చరణ్, రానాతో కలి మానోజ్ కూడా చిన్నప్పటినుంచి తిరిగాడు. తాజాగా శర్వానంద్ ఉస్తాద్ షోలో భాగంగా  స్క్రీన్ పై శర్వానంద్, చిరంజీవి, రామ్ చరణ్ ఉన్న ఫోటో వేసాడు మనోజ్. ఆ ఫోటోని చూసి.. చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని అన్నాడు శర్వానంద్. 

ఇక ఆ  లాన్ లో తర్వాత ఏం చేశామో గుర్తుందా  బాబాయ్ అనగా.. శర్వానంద్  గుర్తు లేదన్నట్టు ఉండగా పడి దొర్లాడామని మంచు మనోజ్ అన్నారు. అలాంటివి చెప్పకు అని శర్వానంద్ అన్నాడు. అయితే ముగ్గురు కలిసి ఆ లాన్ లో పడి దొర్లాడినట్టు గుర్తుందా అని అడిగాడు మనోజ్. ఇంకా అక్కడ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బోలెడన్ని చిలిపి పనులు చేసారని తెలిపాడు. దీంతో శర్వా – చరణ్ ఫ్రెండ్షిప్ తో పాటు మనోజ్ కూడా వీరితో చిన్నప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తాజాగా ఆడియన్స్ కు అర్ధం అయ్యింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios