కమల్ హాసన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ థ్యాంక్స్,.. ఎందుకంటే..?
లోకనాయకుడు కమల్ హాసన్ కు .. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన కమల్ కు దన్యవాధాలు తెలిపారు. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి.. ఒకప్పటి స్టార్ హీరో.. దివంగత నటుడు కృష్ణ మరణించి ఏడాది కావస్తోంది. లాస్ట్ ఇయర్ నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హీరోగా.. నిర్మాతల పాలిట దేవుడిగా.. అభిమానులకు ఆప్తుడిగా కృష్ణ చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణ మరణం తరువాత ఏడాది పొడుగునా.. ఆయన జ్ఞపకాలు పంచుకుంటూ.. విగ్రహావిష్కరణలుజరుగుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని.. లోకనాయకుడు కమల్ హాసన్ ఓపెనింగ్ చేశారు.
రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన స్వస్థ అయిన బుర్రిపాలెంలోఆయన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు తప్ప కృష్ణ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు తమ తండ్రిని తలుచుకుని.. సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజాగా విజయవాడ గురునానక్ కాలనీలో అభిమానులు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తమిళ స్టార్ సీనియర్ నటుడు.. లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిధిగా వచ్చారు. అంతే కాదు తన స్వహస్తాలతో.. ఈ విగ్రహాన్ని ఒపెనింగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈక్రమం సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. ఈ కార్యక్రమానికి సబంధించిన ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.ఈ విధంగా నోట్ రాశారు. నాన్న గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.ఈ విగ్రహావిష్కరణ విషయంలో అటు అభిమానలు కూడా స్పందిస్తున్నారు. వారితో పాటు కృష్ణ కుటుంబ సభ్యుటు కూడా కమల్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నారు.