గోపీచంద్ - ఇప్పుడున్న హీరోల్లో మంచి యాక్షన్ కథలకు సెట్టయ్యే హీరోల్లో గోపి ఒకరు. విలన్ గా చేసి కష్టపడి పైకొచ్చి కొత్త దర్శకులతోనే మొదట్లో హిట్స్ అందుకున్నాడు. అయితే ఈ మధ్య అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. లౌక్యం తరువాత వరుసగా జిల్ - గౌతమ్ నందా - ఆక్సిజన్ - పంతం సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆరడుగుల బులెట్ అయితే రిలీజ్ కూడా కాలేదు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు తీరుతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది హిట్టందుకోకాపోతే గోపి కెరీర్ డేంజర్ జోన్ లో పడ్డట్లే.. 

సాయి ధరమ్ తేజ్ - ఈ మెగా మేనల్లుడి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. సీనియర్ దర్శకులతో వర్క్ చేసిన వర్కౌట్ అవ్వడం లేదు. వివి.వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఇంటిలిజెంట్ తో పాటు కరుణాకరన్ తేజ్ ఐ లవ్యూ కూడా బెడిసికొట్టాయి. 2016 లో వచ్చిన సుప్రీమ్ సాయికి చివరి హిట్. ఆ తరువాత వచ్చిన ఆరు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం నేను శైలజా దర్శకుడితో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్టయితేనే నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి. 

నితిన్ - మంచి మార్కెట్ ఉన్న ఈ హీరో కూడా కెరీర్ లో సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఏడేళ్ల తరువాత ఇష్క్ - గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో సక్సెస్ రూట్ లోకి వచ్చాడు అనుకునేలోపే మళ్ళీ తడబడ్డాడు. ఇక 2016 లో త్రివిక్రమ్ అఆ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ ఆ తరువాత లై సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. చల్ మోహన రంగ - శ్రీనివాస కళ్యాణం కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరోకు ఇప్పుడు హిట్ తప్పనిసరి. ప్రస్తుతం ఛలో దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. 

అక్కినేని వారసుడు అయితే ఇంకా మొదటి అడుగు కూడా వేయలేదు. అఖిల్ -  హలో బయ్యర్స్ కి నష్టాలను ఇవ్వడంలో టాప్ లో నిలిచాయి. ఇక ఇప్పుడు వెంకీ అట్లూరితో చేసిన మిస్టర్ మజ్నుపైనే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టయితేనే అఖిల్ పెద్ద సినిమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 

రవితేజ: మోస్ట్ టాలెంటెడ్ ఎనర్జిటిక్ యాక్టర్ అయిన ఈ హీరో కెరీర్ ఇక ముగిసినట్లే అని ఒక టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే రాజా ది గ్రేట్ సినిమాతో ఎంత పెద్ద హిట్ అందుకున్నాడా అదే స్థాయిలో మరో మూడు సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. టచ్ చేసి చూడు - నేల టికెట్టు - అమర్ అక్బర్ ఆంటోని బాగా దెబ్బేశాయి. ఇప్పుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిజల్ట్ ను బట్టి రవితేజను జనాలు ఎంతవరకు గుర్తు పెట్టుకున్నారు అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.