Asianet News TeluguAsianet News Telugu

తనికెళ్ల భరణి జీవితంలో ఇంత విషాదం ఉందా..? ఎమోషనల్ కామెంట్స్ చేసిన స్టార్ నటుడు

తన జీవితంలో జరిగిన ఏకైక అతిపెద్ద విషాదం గురించి వెల్లడించారు టాలీవుడ్ స్టార్ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. ఆ విషయం తలుచుకుని చాలా రోజులు కోలుకోలేదు అన్నారాయన. 

Tollywood Star Actor Tanikella Bharani Comments Viral In Social Media JMS
Author
First Published Feb 21, 2024, 5:20 PM IST

టాలీవుడ్ లో  మల్టీటాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు తనికెళ్ల భరణి. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనికెళ్ల భరణికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక  ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన తనికెళ్ల భరణి... పేపర్ పై ఎన్నోరచనలతో సాహిత్యానికి జీవం పోశారు. ఇక ఇండస్ట్రీలో ఈమధ్య పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తనలో రచయితకు పదును పెడుతూ.. బిజీగా ఉన్న సీనియర్ నటుడు.. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు. 

తన  సినిమా కెరీర్ కు, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయనపంచుకున్నారు.  అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. రచయితగా ... నటుడిగా నాటకరంగం నుంచి కొనసాగిన తన ప్రస్థానం గురించి వివరించారు. తనకి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ, 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి' పేరుతో వచ్చిన అవార్డు ఎంతో ఇష్టమని భరణి అన్నారు. అయితే తన జీవితం అంత సాఫీగా సాగిపోలేదని.. కష్టాలు కూడా చూశానన్నారు భరణి. అంతే కాదు.. తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన విషయాన్ని గురించి వెల్లడించారు తనికెళ్ళ. 

ఆయన మాట్లాడుతూ.. నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది .. అది నా స్నేహితుడి మరణం. 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంటుంది. నా మిత్రుడు దేవరకొండ నరసింహ కుమార్ అని ఉండేవాడు. డిగ్రీ వరకూ ఇద్దరం కలిసే చదువుకున్నాం. తనకి నా కంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది .. ఎంతోమంచి వాడు.. చాలా తెలివైనవాడు.  కాని అలాంటి వాడికి ప్రమాదం జరగడం..వాడు మరణించడం జరిగింది.  ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అన్నారు స్టార్ నటుడు. 

 అంతే కాదు  నాలో ఒక రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది అతనే. నన్ను ప్రోత్సహించి రాయిస్తూ ఉండేవాడు. నేను వ్రాసింది చదివి చాలా బాగుందని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. నేను బాగా రాయగలను అనే ఒక నమ్మకాన్ని నాకు కలిగించి ఆ రూట్లో నేను ముందుకు వెళ్లడానికి కారణమే వాడు. అలాంటి మిత్రుడిని కోల్పోయిన నాకు, కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది.. అని ఎమోషనల్ అయ్యారు తనికెళ్ల భరణి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios