బాలీవుడ్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సిరీస్ ని నాలుగైదు భాగాలుగా డివైడ్ చేసి తెరకెక్కించారు. ఒక్కో భాగాన్ని ఒక్కో డైరెక్టర్ తో తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ బాగానే ఖర్చుపెట్టింది.

ఆ వెబ్ సిరీస్ మాదిరి తెలుగులో కూడా ఓ సిరీస్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి వంటి దర్శకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ లకు క్లీన్ అండ్ డీసెంట్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరుంది. సందీప్ రెడ్డి బోల్డ్ నెస్ గురించి తెలిసిందే. ఇక సంకల్ప్ రెడ్డి క్రియేటివిటీకి ఇండస్ట్రీలోనే కాకుండా ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

ఇప్పుడు ఈ నలుగురు కలిసి అధ్బుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ కోసం ఈ నలుగురు చేతులు కలపబోతున్నారు. మరి తెలుగులో ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!