సారాంశం
ఈమధ్య మన టాలీవుడ్ స్టార్స్ అన్నీ కాస్ట్లీ వస్తువులే వాడేస్తున్నారు. అవి కాస్తా సోషల్ మీడియాల్ తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు వాటికాస్ట్ కూడా నెట్టింట హైలెట్అవ్వడంచూస్తున్నాం తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెట్టుకున్న కళ్ళజోడు హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా నాగార్జున బిగ్ బాస్ షర్ట్.. అందకు మందు మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్.. నయనతార కోసం తన భర్త కొన్న కాస్ట్లీ కారు.. అంతుకు ముందు ఎన్టీఆర్, చిరు పెట్టుకున్న వాచ్.. ఇలా సెలబ్రిటీలు వేసుకునే వస్తువలు, వాడే కార్లు, చేసే పనులపై సోషల్ మీడియా జనాలకు ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. దాంతో ఇలాంటి వార్తలకోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెట్టుకున్న కళ్ల జోడు కాస్ట్ కాస్ట్ వైరల్ అవుతోంది.
రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు విజయ్. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.మొజాయిక్ ప్యాచ్‌లతో సెట్ చేసిన చిక్ ఆఫ్ వైట్ హుడీతోపాటు.. లగ్జరీ బ్రాండ్ గివెన్చీ గాగూల్స్ ను పెట్టుకున్నాడు సెలబ్రెటీ అవుట్ ఫిట్స్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీ ప్రకారం.. విజయ్ ధరించిన స్టైలిష్ గాగుల్స్ రేటు 1.58 లక్షలు అని తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి..ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ కేవలం గాగుల్స్ కోసం లక్షకు పైగా డబ్బులు పెట్టాడంటే.. ఇక ఇతర వస్తువలకుఎన్ని పెట్టి ఉంటాడు అని కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ న్యూలుక్.. స్టైలిష్ గాగుల్స్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
ఇక విజయ్ దేవరకోండ చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. తన సొంత క్లాత్ బ్రాండ్ RWDY ఉత్పత్తులను సైతం ప్రమోట్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే.. విజయ్, మృణాల్ జంటగా నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీలో తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పెషల్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.