Asianet News TeluguAsianet News Telugu

దొంగ సభ్యత్వాలతో 1000 కోట్లు మింగేశారు.. నిర్మాత సంచలనం!

గత కొన్ని నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రపురి కాలనీ గృహ కేటాయింపు వివాదం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలోని పేద కార్మికులకు గృహ వసతి కల్పరించేందుకు 1994లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 67 ఎకరాల భూమిని కల్పించింది. 

Tollywood Producer sensational comments on land scam
Author
Hyderabad, First Published Sep 11, 2019, 3:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చిత్రపురి భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అసలైన సినీ కార్మికులకు న్యాయం జరగడం లేదని టాలీవుడ్ సినీ వర్కర్స్ కొన్ని నెలలుగా నిరసన చేపడుతున్నారు. వీరి నిరసనకు ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా కేతిరెడ్డి ఈ వివాదంపై మరోమారు స్పందించారు. దాదాపు 4000 మందికి పైగా గృహవసతి కల్పించాలనేది ప్లాన్. కానీ ఇందులో జరుగుతున్న అవినీతితో చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు 2300 మందికి అక్రమంగా ఇంటిని కేటాయించినట్లు కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 1000 కోట్ల అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపణ. 

చిత్రపురి భూముల కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడి కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇందులో ఇళ్ళని కేటాయించారు. వారు చిత్ర పరిశ్రమలో ఏదో ఒక క్రాఫ్ట్ లో పనిచేస్తున్నట్లు దొంగ సభ్యత్వాలు క్రియేట్ చేసినట్లు కేతిరెడ్డి ఆరోపించారు. 

ఈ అవినీతికి బాధ్యత వహిస్తూ కమిటీ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించి నిజమైన సినీ కార్మికులకు న్యాయం జరిగేలా చేయాలని కేతిరెడ్డి కోరారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios