టాలీవుడ్‌లో వరుస మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. పీఆర్వో, నిర్మాత, సినీ జర్నలిస్ట్ బి.ఏ.రాజు, ఎడిటర్‌ జయరాం, నిర్మాత విశ్వేశ్వరరావు ఇటీవల కన్నుమూశారు. తాజాగా ప్లే బ్యాక్‌ సింగర్‌ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. 

కరోనా కారణంగా, అనారోగ్య కారణాలతో ఇటీవల వరుసగా సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస మరణాలతో తీవ్ర విషాదాలను నెలకొంటున్నాయి. దర్శకుడు కె. వి ఆనంద్‌, వివేక్‌, బి.ఏ రాజు, ఇతర యువ దర్శకులు, అలాగే హిందీలో సంగీత దర్శకులు రామ్‌లక్ష్మణ్‌, నటుడు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పీఆర్వో, నిర్మాత, సినీ జర్నలిస్ట్ బి.ఏ.రాజు, ఎడిటర్‌ జయరాం, నిర్మాత విశ్వేశ్వరరావు ఇటీవల కన్నుమూశారు. తాజాగా తెలుగు ప్లేబ్యాక్‌ సింగర్‌ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆయన ప్లేబ్యాక్‌ సింగర్‌గా అనేక సినిమాలకు పాటలు పాడారు. తనదైన గాత్రంతో శ్రోతలను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.