తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక ఈరోజు ఆయా చిత్రాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. 

30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైత‌న్య రావు (Chaitanya Rao), భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి 'తురుమై వచ్చేయ్..' లిరికల్ సాంగ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ - "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. ఈ సినిమాలోని తురమై వచ్చేయ్ పాట రిలీజ్ చేశాను. ఈ పాట వినగానే నచ్చేలా ఉంది. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.

గంగా ఎంటర్టైన్మంట్స్ వారి 'శివం భజే'..

యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ ఈ రోజు ప్రకటించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'శివం భజే' అని టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించింది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి, దర్శకుడు అప్సర్ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. చిత్రంలో నటీనటులుగా అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, సాయి ధీన, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు నటిస్తున్నారు. 



‘మార్కెట్ మహాలక్ష్మి’ ట్రైలర్ లాంచ్....

‘కేరింత’ మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేశారు.


YouTube video player