సారాంశం
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ యంగ్ స్టార్ తాజాగా చేసిన ఓ ట్వీట్.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతకీ విశ్వక్ చేసిన ట్వీట్ ఏంటి..?
టాలీవుడ్‌లో ఉన్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో విశ్వక్‌సేన్. గెలుపు ఓటములు పట్టించుకోకుండా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. అంతే కాదు సినిమాకో వివాదాన్ని మూటగట్టుకున్నాడు యంగ్ హీరో. ఈ ఏడాది ధమ్ కీ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. వీటిలో రవితేజ దర్శకత్వంలో నటిస్తోన్న మూవీ కూడా ఒకటి. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.
విశ్వక్ సేన్ ఏదో ఒక వివాదంలో నానూతూ ఉంటాడు. తాజాగా విశ్వక్‌సేన్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆయన ట్వీట్ లో ఏముందంటే... కాదు అంటే కాదు.. ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి.. కూల్‌గా ఉందాం. మనమంతా శాంతియుత వాతావరణంలో ఉన్నాం. అందుకే విశ్రాంతి తీసుకోండి.. అంటూ కాస్త సెటెరికల్ గా ట్వీట్ చేశాడు మాస్ కా దాస్. దాంతో విశ్వక్ సేన్ ట్వీట్ ఎవరిగురించా అని అంతా ఆలోచనలోపడ్డారు.
ఇంతకీ విశ్వక్‌సేన్ చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించిందనే దానిపై ఇండస్ట్రీలో లోపన పెద్ద చర్చ నడుస్తోంది. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో తెగ చర్చ జరుగుతోంది. నెటిజన్లు, అభిమానులు. ఈ ట్వీట్ వెనుకున్న కారణాలపై విశ్వక్‌సేన్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.ఇదిలా ఉంటే విశ్వక్‌సేన్ కొన్ని నెలల క్రితం సౌత్ స్టార్ హీరో అర్జున్ సార్జా తో కలిసి ఓ సినిమా చేయబోయాడు. అర్జున్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది.
కాని కొన్ని కారణాలతో అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించేశాడని తెలిసిందే. విశ్వక్‌సేన్ ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11వ సినిమా కూడా లాంఛ్ చేశాడు. VS 11 ఇటీవలే సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.విశ్వక్ సేన్ మరోవైపు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న గామి సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఘోరాగా కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.
Ad3అయితే విశ్వక్ సేన్ చేసిన ఈ ట్వీట్ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించే అని ప్రచారం జరుగుతోంది. సాయి రాజేష్ బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈసినిమా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఈసినిమా గురించి డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ కథ ముందు ఓ యంగ్ హీరోకు చెప్పానని.. కాని అతను కథ మొత్త కూడా వినకుండా రిజక్ట్స్ చేశాడని.. ఆరోజు చాలా బాధపడ్డాను.. రాత్రి నిద్ర కూడా పట్టలేదని సాయి రాజేష్ అన్నారు. అయితే అతను కథ చెప్పింది విశ్వక్ సేన్ కే అని.. విశ్వక్ ట్వీట్ చేసింది కూడా సాయి రాజేష్ మీదనే అని అంతా అనుకుంటున్నారు.