ఈ మధ్య షూటింగ్ సెట్స్ లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో హీరోలు ఎక్కువగా గాయపడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షూటింగ్ సెట్ లో గాయపడినట్టుతెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ కు ప్రమాదం జరిగనిట్టు తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ సందేశ్. జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ది కానిస్టేబుల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైటింగ్ సీన్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో వరుణ్ సందేశ్ కి ప్రమాదం జరిగింది. దీంతో ఆయన కాలికి బలమైన గాయం తగలడంతో.. వెంటనే స్పందించిన యూనిట్ డాక్టర్లను తీసుకురాగా... డాక్టర్లు ఆయన కాలికి కట్టుకట్టినట్టు తెలుస్తోంది.
అంతే కాదు. కాలికి బలమైన గాయం కావడంతో.. దాదాపుగా మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారట. దీంతో జోరుగా సాగుతున్ సినిమా షూటింగ్ కు సడెన్ గా బ్రేక్ పడినట్టు అయ్యింది. ది కానిస్టేబుల్ ఓ కానిస్టేబుల్ జీవితం ఎలా ఉంటుంది అనే అంశాన్ని కథగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈసినిమాను బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ రన్నింగ్ లో ఉంది. దాదాపు ఈ షెడ్యూల్ లో 40 శాంతం షూటింగ్ కూడా పూర్తయ్యిందని నిర్మాత తెలిపారు. వరుణ్ సందేశ్ పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన వరుణ్ సందేష్.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కాని పెద్దగా సెట్ అవ్వలేకపోయాడు. తనతో పాటు నటించిన సహనటి వితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి జంటగా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు కూడా. ఇక తాజాగా వరుణ్ సందేష్ కు గాయం అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
