తెలుగు రెండు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపులు అనంతరం కరోనా వ్యాప్తి అధికమైపోయింది. ప్రతీ రోజు  వేలల్లో కరోనా కేసులు బయట పడుతున్నాయి.  కరోనా మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి సామన్యుడు నుంచి సెలబ్రిటీలకు వరకు అంందరినీ గజగజవణికిస్తోంది. 

ఇప్పటికే చిత్ర పరిశ్రమలో కొందరు కరోనా బారిన పడ్డారు. సీనియర్ నిర్మాత పోకూరి రామారావు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో తండ్రి కరోనాతో పోరాడి మరణించారు.

వివరాల్లోకి వెళితే...మారుతీ దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈరోజుల్లో చిత్ర హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రామ్ ప్రసాద్ నిన్న కరోనా వ్యాధి తో మృతి చెందారు. గత 20 రోజులుగా విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి 8:30 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.