Asianet News TeluguAsianet News Telugu

Tollywood : విలన్లుగా మారుతున్న ఒకప్పటి టాప్ హీరోలు.. విలన్లుగానూ మెప్పిస్తున్నారు..

టాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరోలు ప్రస్తుతం నెగటివ్ రోల్స్ లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తున్నారు. హీరోగా అప్పట్లో ఊపూపిన హీరోలు విలన్ల పాత్రలో ఒదిగిపోతున్నారు. 
 

Tollywood Hero's Turn into Villans.!
Author
Hyderabad, First Published Jan 24, 2022, 12:45 PM IST

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోగా నిలిచిన వీరమాచినేని జగపతి  చౌదరి ప్రస్తుతం ఏ సినిమా వచ్చిన విలన్ రోల్ లోనే కనిపిస్తున్నాడు. ఒకటి, రెండు సినిమాలు మినహాయించి ఏ సినిమా చూసినా నెగటివ్ రోల్ లోనే నటించిన మెప్పించాడు జగపతి బాబు. కే రాఘవేంద్ర రావు, రాధా మోహన్, ఎస్ వీ క్రిష్ణ రెడ్డి, క్రిష్ణ వంశీ, ఈవీవీ సత్యనారాయణ వంటి టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేసిన జగపతి బాబు లీడ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

‘సింహ స్వప్నం’తో 1989లో తెలుగు ప్రేక్షకులకు హీరోగా కనిపించాడు జగపతి బాబు. ఆ తర్వాత వచ్చిన ‘ అడవిలో అభిమన్యుడు, పెద్దరికం, గాయం, శుభలగ్నం, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, మావిచిగురు, సామాన్యుడు, పెళ్లైన కొత్తలో, లక్ష్యం, జై బోలో తెలంగాణ’ లాంటి సినిమాలు చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  

ఇప్పటి వరకు 120 సినిమాల్లో కనిపించిన జగపతి బాబు 2014 నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. తన కేరీర్ మూవ్ అన్ అయ్యేందుకు  2014లో నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించిన ‘లెజెండ్’ మూవీలో తొలిసారి నెగటివ్ రోల్ లో ‘జితేంద్ర’ పాత్రలో నటించాడు.  ఈ మూవీతో బాలక్రిష్ణ నటనకు ఎంత మంచి టాక్ వచ్చిందో, జగపతి బాబు కూడా అంతే రెస్పాన్స్ ను దగ్గించుకున్నాడు. ఆ తర్వాత ‘లింగా’, ‘నాన్నకు ప్రేమతో..’,  ‘జాగ్వార్’, ‘రంగస్థలం’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘సైరా నర్సింహా రెడ్డి’ మూవీల్లో తన విలనిజాన్ని ప్రేక్షకులకు చూపించాడు. ప్రస్తుతం ఆయనకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా నెగటివ్ రోల్ లోనే ఉంటున్నాయి.  
త్వరలో ‘గుడ్ లక్ సఖి’, ‘గని’, ‘రాధే శ్యామ్’, ‘సాలార్’ మూవీల్లో మరిన్ని సరికొత్త క్యారెక్టర్లలో కనిపించనున్నారు జగపతి బాబు.  

తన సినిమాల్లో  ఇన్నోసెంట్ గా, లవర్ బాయ్ గా కనిపించే శ్రీకాంత్ కూడా ప్రస్తుతం నెగటివ్ రోల్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారనిపిస్తోంది. 1991లో ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’మూవీతో తెలుగు ఆడియెన్స్ దగ్గరయ్యాడు శ్రీకాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘అబ్బాయి గారు’, ‘రథ సారథి’, ‘ఆమె’, ‘పెళ్లి సందడి’, ‘పండగ’, ‘పిల్ల నచ్చింది’ ‘ఏవండో శ్రీవారు’ వంటి చిత్రాలు  హిట్ గా నిలిచాయి. 

 హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించిన  ‘శ్రీకాంత్’ ప్రస్తుతం విలన్ గా దర్శనమిస్తున్నాడు. ఇటీవల నందమూరి బాలక్రిష్ణ ‘అఖండ’తో సెన్సెషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో  శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.  అంతకు ముందు యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా చేసినా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. కాగా, జగపతి బాబు, శ్రీకాంత్ ఇద్దరు బాలయ్య బాబు చిత్రాల్లోనే తొలిసారిగా విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అయితే శ్రీకాంత్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ వచ్చే సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

కమెడియన్ గా కేరీర్ ప్రారంభించిన ‘సునిల్ ’ కూడా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పూలరంగడు’, ‘మిస్టర్ పెళ్లి కొడుకు’, ‘ఉంగరాల రాంబాబు’ వంటి చిత్రాలతో, సిక్స్ పాక్ తోనూ టాప్ హీరోలతో తలపడ్డాడు సునిల్. అయితే ఇటీవల వచ్చిన ‘పుష్ఫ’లో సునిల్ పాత్ర తెగ మెప్పిచింది. అంతకు ముందు వచ్చిన ‘కలర్ ఫొటో’మూవీలోనూ నెగటివ్ రోల్ చేశాడు. మున్ముందూ సునిల్ మరిన్ని సినిమాల్లోనూ నెగటివ్ రోల్ లో కనిపించే అవకాశం లేకపోలేదు.  

ఇక పోతే పలు సినిమాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులను  హీరోగా అలరించిన నందమూరి తారక రత్న కూడా విలన్  పాత్రలు పోషిస్తున్నాడు. నారా రోహిత్ నటించిన ‘రాజా చేయ్యి వేస్తే’ మూవీలో తారక రత్న నెగటివ్ రోల్ కనిపించాడు.   ఇలా హీరోలు తమ కేరీర్ గ్రోత్ కోసం లీడ్ రోల్సే కాకుండా నెగటివ్ రోల్స్ లోనూ నటించేందుకు ఒప్పుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios