Asianet News TeluguAsianet News Telugu

నితిన్ ను నిరాశ పరిచిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గత సినిమాల కంటే ఘోరం..

సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడుటాలీవుడ్ యంగ్ హీరో నితిన్. కాని ఎంత ప్రయత్నించినతా.. మనోడి కోరిక తీరడం లేదు. ఎంత కష్టపడ్డా..మినిమ్ హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. ఇక కలెక్షన్ల విషయం సరాసరి. 

Tollywood Hero Nithin Extraordinary Man Movie Collections JMS
Author
First Published Dec 10, 2023, 9:00 AM IST

రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్ధినరీమ్యాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. హాడావిడి లేకుండా కామ్ గా వచ్చి కలెక్షన్లు కొల్లగొడదాం అనుకున్నాడు. వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్న యంగ్  స్టార్ .. ఈసినిమాతో మంచి ఓపెనింగ్స్ రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర సందడి చేయాలి అనుకున్నాడు కాని.. ఇంతకు ముందు ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలకంటే ధారుణమైన ఓపెనింగ్స్ ఈసినిమాకు వచ్చి నితిన్ కు షాక్ ఇచ్చాయి. 

ఎక్స్ ట్రా ఆర్డినరీమ్యాన్ మూవీ..  బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.  కాని ఫస్ట్ రోజు ఈసినిమా సాధించింది  ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల వసూలు మాత్రమే అంటున్నారు.  భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ.. నితిన్ గత సినిమాలకంటే దారుణం అనిపించింది.  మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 23.04 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం  ఉంది. వీకెండ్ లో ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు టీమ్. 

అయితే నితిన్ తన కెరీర్ లో ఎప్పటికప్పుడు మంచి ఓపెనింగ్స్ సాధిస్తూ వచ్చాడు.  ప్లాప్ సినిమాలు చేసినా.. రెండంకెల స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకున్నాడు. రంగ్ దే, మాచర్చ నియోజకవర్గం లాంటి సినిమాలు ప్లాప్అయినా.. ఆ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక నితిన్ కెరీర్ లో అతి పెద్ద చెత్త సినిమా అనిపించుకున్న చెక్ కూడా 6కోట్ల ఓపెనింగ్ ను అందుకుంది. కాని ప్రస్తుతం రిలీజ్ అయిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మాత్రం 4 కోట్లతో ఒపెనింగ్ చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈమూవీతో నితిన్ ఇమేజ్ ఇంకాస్త తగ్గినట్టు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ పై అభిమాని ప్రేమ.. ఏకంగా నీటిపై బన్నీ స్పెషల్ ఆర్ట్.. వైరల్ అవుతున్న వీడియో

ఇక ఈమూవీ మంచి అంచనాలుతో రిలీజ్అయ్యింది. అన్ని  ఖర్చులన్నీ కలుపుకొని ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు తెలుస్తోంది.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్స్ పాజిటివ్‌గా మారడంతోఎక్ట్రా ఆర్డినరీ మెన్ బజ్ క్రియేట్ అయింది.దాంతో బిజినెస్‌‌కు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ కలుపుకుని 27 కోట్లు పలికింది. రిలీజ్ కూడా భారీగా చేశారు. ఏపీ, నైజాంలో 450 స్క్రీన్లు, కర్ణాటక, ఓవర్సీస్‌లో కలుపుకొని 800 స్క్రీన్లలో  నితిన్ సినిమాను రిలీజ్ చేశారు. 

అయితే సినిమాకు అనుకన్న స్థాయికి దగ్గరగా కూడా కలెక్షన్లు రాలేదు. అసలు అంత బజ్ ఉన్నా.. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా  పెద్దగా జరగలేదని చెప్పాలి. ఎక్స్ ట్రా ఆర్డినరీమ్యాన్ మొత్తంగా 28 కోట్ల షేర్ ను వసూలు చేస్తే లాభాల్లోకి చేరుతుంది. 28 కోట్ల షేర్ అంటే.. దాదాపు గా 52 కోట్ల గ్రాస్ వసూళ్ళు జరగాలి. కాని ఈసినిమా  ఓపెనింగ్ గ్రాస్ 4 కోట్లు మాత్రమే అనేది టాక్. మరి ఈసినిమా థియేటర్ల నుంచి బయటకువెళ్ళే వరకూ ఆ కలెక్షన్స్ ను రాబడుతుందా లేదా అనిది ప్రశ్న..? 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios