Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ పై అభిమాని ప్రేమ.. ఏకంగా నీటిపై బన్నీ స్పెషల్ ఆర్ట్.. వైరల్ అవుతున్న వీడియో

అల్లు అర్జున్ కు సర్ ప్రైజ్ఇచ్చాడు ఓ అభిమాని. తనకున్న అద్భుతమైన టాలెంట్ లో సర్ ప్రైజ్ చేశాడు.. బన్నీతో పాటు.. ఫ్యాన్స్ అంతా ఫిదాఅయ్యేలాచేశాడు. 
 

Allu Arjun Fan Special Art on Water and surprise to Icon Star JMS
Author
First Published Dec 10, 2023, 7:06 AM IST

సినిమాతారలకు రకరకాల ఫ్యాన్స్ ఉంటారు. వారు రకరకాలుగా తమ అభిమానాన్ని వెల్లడించాలని ప్రయత్నిస్తుంటారు. ఎంత వెరైటీగా ఆలోచిస్తే.. అంద గుర్తింపు వస్తుంది..లేదా తమ స్టార్ హీరో దగ్గర మంచి మార్కులు కొట్టేయవచ్చు అన్న ఆరాటం కూడా ఉంటుంది. ఆమధ్య ఎక్కువగా ఫ్యాన్స పాదయాత్రలు చేస్తూ.. తమ అభిమాన నటుడిని కలుసుకోవడం.. చేయడం లాంటివి చేశారు. అంతే కాదు ఓ అభిమాని తన పొలంలో రామ్ చరణ్ బొమ్మ వచ్చేలాగా పంటను పండించడంతో పాటు.. ఆ వరిపంటకు సంధించిన వడ్లను చరణ్ కుఅందించాడు. వడ్ల గింజలతో ఆర్ట్ ను తయారు చేయించి మెగా పవర్ స్టార్ కు అందించాడు. ఇలా డిఫరెంట గా తమ ప్రేమను చాటుకుంటుంటారు అభిమానులు 

ఇక ఈక్రమంలో అలా అల్లు అర్జున్‌కి కూడా  తెుగు రాస్ట్రాలలో  వీరాభిమానులు చాలామంది ఉన్నారు. పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా కూడా తనకు అభిమానులు పెరిగిపోయారు.  తమ అభిమానం చాటుకునేందుకు, వారి దృష్టిలో పడేందుకు ఏదో ఒకటి చేస్తుంటారు. ఈక్రమంలోనే  ఓ ఆర్టిస్ట్ తన టాలెంట్ చూపించాడు. ఏకంగా నీటిపై అల్లు అర్జున్ బొమ్మ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే  మన కళ్ళను మనమేనమ్మలేం. 

సురోయ్ వాల్  అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు ఆ అభిమాని ఎవరు అన్నది మాత్రం ముఖం కనిపించలేదు. వివరాలే కూడా తెలియవు కాని.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఓ   పళ్లెంలో ఉన్న నీటిపై రంగులతో ఓ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ బొమ్మను వేయడం కనిపించింది. బొమ్మ మొత్తం పూర్తయ్యాక పుష్ప సినిమాలో మెడపై చేయి పెట్టి  తగ్గేదేలే అంటూ  పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ కుసబంధించిన  ఫోజు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆ బొమ్మ వేసిన ఆర్టిస్టు టాలెంట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. 

 

అంతే కాదు అభిమనాలు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. ఎలాగైనా ఈ వీడియో బన్నీ వరకు చేర్చే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్ వరకూ ఈ బొమ్మ పోలేదు ఒక వేళ వెల్ళి ఉంటే ఆయన కూడా తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి.. ఆ వ్యక్తి టాలెంట్ ను మెచ్చుకునేవారు.. ఫీదా అయ్యేవారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15 న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ఈసినిమాను చెక్కేపనిలో ఉన్నాడు. అంతే కాదు.. ఈసారి ఈసినిమాను ఆస్కార్ కు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios