Asianet News TeluguAsianet News Telugu

Naga chaitanya: చైల్డ్ కేర్ సెంటర్ లో నాగచైతన్య, చిన్నారులతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో ..

తన మంచి మనసు చాటుకుంటున్నాడు చైతూ.. తాజాగా నాగచైతన్య..ఓ చైల్డ్ కేర్ సెంటర్ కు వెళ్ళాడు. అక్కడ చిన్నారులతో కలిసిపోయి.. వారితో సరదాగా ఆడుకున్నాడు. 

Tollywood Hero Naga chaitanya In Cancer Child Care Center JMS
Author
First Published Nov 17, 2023, 10:44 AM IST

వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. ఈఏడాది చేసిన కష్టడీసినిమా కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చైతూ. బాగా కష్ట పడుతున్నాడు కూడా.ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో NC23 సినిమాతో బిజీగా ఉన్నాడు.

హీరో నాగచైతన్య  తన నెక్ట్స్ సినిమా కోసం బిజీ అయ్యాడు. ఈసారి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు చైతూ. ప్రాక్టికల్ గా తన పాత్ర కోసం బాగా గ్రౌండ్ వర్క్ చేశాడు. అందుకోసం చాలా టైమ్ తీసుకుని.. కావల్సిన ఫీడ్ బ్యాక్ ను తానే స్వయంగా తీసుకున్నాడు. ఎన్నో ఊర్లు తిరిగి.. తన పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్.. పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేశాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. 

ఇక గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై  భారీ బడ్జెట్ తో ఈసినిమాను  నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈమూవీ NC23 వర్కింట్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోబోతున్నారు. అయితే నాగచైతన్య.. బాగా ప్రాక్టీస్ చేసిన పాత్ర ఇదే.. మత్స్యకారుల పాత్ర. ఇక ఈసినిమాలో మొదట హీరో ఎలా ఉన్నా.. పాకిస్థానీలకు చిక్కిన తరువాత చిక్కి శల్యమైపోవాలసిందే. అదే పాత్రకోసం..రియాల్టీకి దగ్గరగా ఉంటుందని బరువు తగ్గబోతున్నారట చైతూ. 

 

ఈ సినమాలో  పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు నాగచైతన్య. ఆక్యారెక్టర్  కోసం బరువు కూడా తగ్గుతున్నారట చైతు. ఇందులో చైతు మేకోవర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేస్తుందని సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే.. నాగచైతన్య అటు సినిమాలతో పాటు..ఇటు సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటున్నాడు. ఎప్పటికప్పుడు తన మంచి మనసు చాటుకుంటున్నాడు చైతూ.. తాజాగా నాగచైతన్య..ఓ చైల్డ్ కేర్ సెంటర్ కు వెళ్ళాడు. అక్కడ చిన్నారులతో కలిసిపోయి.. వారితో సరదాగా ఆడుకున్నాడు. వారికి బహుమతులు అందించాడు. 

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు కావాల్సిన వస్తువులను అందించాడు. చైతూ రాకతో చైల్డ్‌ కేర్ సెంటర్ అంతా సందడిగా మారింది. క్యాన్సర్ బాధిత చిన్నారులతో యువ సామ్రాట్ తన వాలుబుల్ టైమ్ ను స్పెండ్ చేయడంతో పాటు.. వారికి ధైర్యాన్నిచ్చి.. సంతోషానిచ్చారు. దాంతో చైతూ చేసిన పనికి ప్రశంసల వెల్లువలా వస్తోంది. సోషల్ మీడియాలో అక్కినేని హీరోను తెగ పొగిడేస్తున్నారు. అందరూమీలాగ ఉంటే.. ఎన్నో జీవితాల్లో వెలుగు నింపబడుతుంది అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios