ప్రతీ శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతుంటాయి. కొన్ని సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటుంటే.. మరికొన్ని ఫ్లాప్ లుగా మిగిలిపోతున్నాయి. ఎప్పటిలానే ఈ వారంలో కూడా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి.

ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రాజశేఖర్ నటించిన 'కల్కి' సినిమా మొదటి నుండి ఆసక్తిని రేకెత్తిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. 

ఈ సినిమాతో రాజశేఖర్ హిట్టు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. కుర్ర హీరో శ్రీవిష్ణు నటించిన 'బ్రోచేవారెవరురా..' సినిమాపై కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రోమోలు, టీజర్, ట్రైలర్ లు హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రెండు సినిమాలే కాకుండా ఆది నటించిన 'బుర్రకథ' కూడా శుక్రవారం నాడు రిలీజ్ కి ఉంది.

ఈ సినిమా స్టోరీ లైన్ కొత్తగా ఉండడంతో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, నాని లాంటి హీరోలు ప్రచారం చేస్తుండడం ఈ సినిమాకి కలిసొస్తోంది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందోననే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.