అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల అత్యవసర సమావేశం

First Published 21, Apr 2018, 11:37 AM IST
Tollywood Film industry meeting at annapoorna studios
Highlights

పవన్ కోసం ఏకమైన సినీలోకం

శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలు ను ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా సీరియస్ తీసుకుంది. శ్రీరెడ్డి అలా మాట్లాడడం వెనుక వర్మనే కారణం అని చేప్పిన వెంటనే ఇష్యూ చాలా సీరియస్ అయ్యింది. అటు వర్మను శ్రీరెడ్డిని ఎవరు క్షమించే పొజిషన్ లో లేరు. శుక్రవారం ఉదయం పవన్‌ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు.

దీంతో ఫిలిం ఛాంబర్ అత్యవసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ (మా), నిర్మాతల మండలితో పాటు సినీ రంగంలోని అన్ని శాఖలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా ఈ సమావేశాన్ని ఛాంబర్‌లోనే నిర్వహించాలని భావించినా.. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ కూడా సినీ పెద్దలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

loader