Asianet News TeluguAsianet News Telugu

`ఆహా` కోసం 'మహర్షి' డైరక్టర్, సీన్ మార్చేస్తాడా!

డైరక్ట్ తెలుగులో వచ్చిన ఆహా ని పట్టించుకునే వారు కనపడటం లేదు. ఉత్సాహంగా కొత్తలో  డబ్బులు కట్టినా, అందులో తాము చూడదగ్గ కంటెంట్ లేకపోవటం వారిని నిరాశపరుస్తోంది. అప్పటికీ అల్లు అరవింద్ ...తమ ఆహా కోసం ముంబైకు చెందిన టీమ్ ని హైర్ చేసుకుని కొత్త తరహా ప్లాట్ లు, ఇంట్రస్టింగ్ కాన్సెప్టులు రెడీ చేయించారు. అయినా కలిసి రాలేదు. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. 

Tollywood directors turn Consultants for Aha
Author
Hyderabad, First Published May 16, 2020, 10:45 AM IST

ఈ లాక్ డౌన్ పీరియడ్ లో జనం ఈ వెబ్ సీరిస్ లను తెగ చూస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్, అమిజాన్ ప్రైమ్ కు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయితే డైరక్ట్ తెలుగులో వచ్చిన ఆహా ని పట్టించుకునే వారు కనపడటం లేదు. ఉత్సాహంగా కొత్తలో  డబ్బులు కట్టినా, అందులో తాము చూడదగ్గ కంటెంట్ లేకపోవటం వారిని నిరాశపరుస్తోంది. అప్పటికీ అల్లు అరవింద్ ...తమ ఆహా కోసం ముంబైకు చెందిన టీమ్ ని హైర్ చేసుకుని కొత్త తరహా ప్లాట్ లు, ఇంట్రస్టింగ్ కాన్సెప్టులు రెడీ చేయించారు. అయినా కలిసి రాలేదు. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. 

క్వాలిటీ లేని కంటెంట్ కారణంగానే ప్రేక్షకులను ఆకర్షించడంలో ఆహా విఫలమవుతోందని ఆయనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ లో తేలింది. దాంతో  ఇప్పుడు ఈ సీనియర్ నిర్మాత కొంతమంది తెలుగు దర్శకులను కన్సల్టెంట్లుగా తీసుకువస్తున్నారు. వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి, చంద్ర సిద్ధార్థ్, మరియు వీఐ ఆనంద్ వంటి దర్శకులు ఆహాకు మంచి స్క్రిప్ట్స్ మరియు చిత్ర దర్శకులను ఎన్నుకోవటానికి సహాయం చేస్తారని సమాచారం. ఈ లాక్‌డౌన్ మరియు షూటింగ్‌లు లేనందున చిత్ర దర్శకులు ఎలాగూ ఖాళీ గానే ఉన్నారు. ఈ చర్య రాబోయే రోజుల్లో ఆహా  అదృష్టాన్ని మారుస్తుందని ఆయన ఆశిస్తున్నాడు. 
 
ఈ నేపధ్యంలో `ఆహా` ప్లానింగులూ భారీగా ఉన్నాయి. ఈ డిసెంబ‌రు లోపు ఏకంగా 20 వెబ్ సిరీస్‌లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తే చాల‌నుకున్నా...  ఓటీటీ ల‌కు ఉన్న డిమాండ్ గ‌మ‌నించిన అల్లు అర‌వింద్ ఆ సంఖ్య‌ని 20కి పెంచినట్లు సమాచారం.  నిజానికి  తెలుగు జనాలకు సరిపడే అంత కంటెంట్ .. ఆహా లో లేదు. సిన్, కొత్త పోరడు వంటి కొన్ని వెబ్ సీరిస్ లు ఇచ్చినా సరిపోవటం లేదు. కరోనా తో ఇంత డిమాండ్ వస్తుందని అల్లు అరవింద్ సైతం ఊహించలేదు. 

దాంతో ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయగానే ఎలాగో సినిమాలు ప్రారంభమయ్యే వాతావరణం కనపడటం లేదు కాబట్టి.. లిమిటెడ్ బడ్జెట్, అధిక జాగ్రత్తలు, లిమిటెడ్ స్టాఫ్ తో షూటింగ్ లు మొదలెట్టాలని ఆయన డిసైడ్ అయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  అలాగే తమ ఓటీటి ప్లాట్ ఫామ్ కు తీసే సినిమాలు పాటలు, డాన్స్ లు వద్దనకుంటున్నారట. 

కేవలం కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు అదీ రెండు గంటల్లో పూర్తయ్యే వాటికే ప్రయారిటీ ఇశ్తారట. కొత్త వాళ్లలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ అతి తక్కువ బడ్జెట్ తో అత్యధిక క్వాలిటీ వచ్చే ప్రాజెక్టులు తమ ఆహా ద్వారా తీసుకురావాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. ఆయన అనుకున్నట్లుగా జరిగితే మంచి కంటెంట్ తో ఆహా దూసుకుపోతుందనటంలో సందేహం లేదు. 
  

Follow Us:
Download App:
  • android
  • ios