దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ సూపర్ స్టార్ యష్ కాంబినేషన్ వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, డైరెక్టర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ సినిమా చూసి రియాక్ట్ అయ్యారు.  

భారీ అంచనాల మధ్య విడుదలైన ' కేజీఎఫ్ 2' .. ఎక్సపెక్టేషన్స్ ని దాటుకుని దూసుకుని వెళుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ యష్ (Yash), మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2018లో వచ్చిన‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. తొలుత ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’తో ఇండియన్ బాక్సాఫీసు వద్ద చెరగని ముద్ర వేసుకుంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లనూ రాబట్టింది. ఇప్పటి వరకు రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో ఇండియన్ హ్యయేస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ లో నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. 

మరోవైపు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్ర యూనిట్ స్టార్ కాస్ట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి సైతం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో, పలు సందర్భాల్లో కేజీఎఫ్ టీంను ప్రత్యేకంగా అభినందిస్తూనే వచ్చాడు. మరోవైపు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు హీరో యష్ ను ఆదరించారు. 

తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’పై స్పందించారు. ఈ సందర్భంగా ట్వీటర్ లో ప్రశసల వర్షం కురిపించారు. ‘చివరిగా కేజీఎఫ్ 2 చూశాను. సినిమాలో కటింగ్ ఎడ్జ్ స్టైల్ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్‌ప్లే అండ్ ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. బోల్డ్ మూవ్‌కి ఇంటర్‌కట్ యాక్షన్ అండ్ డైలాగ్‌లు బ్యూటీఫుల్ గా పనిచేశాయి. ఇక యష్ మాస్ పవర్‌హౌస్‌ని చూపించాడు. ‘పెరియప్ప’ సినిమా అనుభూతిని కలిగించిన ప్రశాంత్ నీల్ కు, చిత్ర యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ పేర్కొన్నాడు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ‘ఆర్సీ15’ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 

అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటించారు. బాలీవుడ్ సీనియర్ నటులు సంజయ్ దత్, రవీనా టండన్, అలాగే తెలుగు నటులు ప్రకాష్ రాజ్, రావు రమేశ్ పలు కీలక పాత్రల్లో నటించారు. హుంబాలే ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు ఇటీవల మేకర్స్ తెలిపిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…