ఆయన టాలీవుడ్ లో ఓ టాలెంటెడ్ డైరక్టర్. ఆయనకు మంచి టేస్ట్ ఉందని, అది ఆయన సినిమాల్లో ప్రతిబింబిస్తూంటుంది. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా సక్సెస్ ఫుల్ గా ఉన్నా..పర్శనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఈగల మోత..బయిట పల్లకీ మోత అన్న పరిస్దితి. ఆయన తన భార్యతో గొడవలు..విడిగా ఉండటం దాకా సాగింది. విడాకులు అయితే తీసుకోలేదు కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇది ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. అయితే ఆయనకు ఉన్న అమ్మాయిల బలహీనతే ఈ స్టార్ డైరక్టర్ ఫ్యామిలీ లైఫ్ లో ఇబ్బందులకు గురి చేసింది. 

అయితే ఆయన గత కొంతకాలంగా ఓ స్టార్ హీరోయిన్ తో పనిచేస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధంతో ఆఫర్స్ కోసం అందరికీ రికమెండ్ చేస్తున్నారట. ఆమెకు రికమండేషన్ లేకపోయినా ఆఫర్స్ వస్తాయి కానీ...ఆయన చెప్తే వచ్చే రెమ్యునేషన్ వేరు అంటున్నారు. తన సినిమాల్లోనే కాకుండా వేరే వారి సినిమాల్లోనూ ఆమెను రికమెండ్ చేయటం మిగతా వాళ్లకు ఇబ్బందిగా మారిందిట.  కానీ ఆయనతో ఉన్న అవసరాలతో ఆమెను చెప్పిన రెమ్యునేషన్ ఇచ్చి తీసుకుంటున్నారట.

అంతేకాదు తనకు స్టార్ హీరోలతో ఉన్న పరిచయాలతో ఆమెను రికమెండ్ చేయటం పిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలిసిన సదరు దర్శకుడు...టాలెంట్ ఉంది కాబట్టే మీకు సెట్ అవుతుందని ఆమెను ప్రమోట్ చేస్తున్నానని చెప్తున్నారట. అయితే ఆమెకు క్రేజ్ ఉండటం కలిసొచ్చే విషయం లేకపోతే ఎవరు రికమెంట్ చేసినా ఎవరూ...ఎవరినీ కోట్లు ఖర్చుపెట్టే ప్రాజెక్టులోకి తీసుకోరని అంటున్నారు.