హీరోయిన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడట!

tollywood director enters into divorce deal with wife
Highlights

టాలీవుడ్ లో తనదైన చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు

టాలీవుడ్ లో తనదైన చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. పీరియాడిక్ డ్రామాలు తెరకెక్కించడంలో అతడిది ప్రత్యేక శైలి. ప్రస్తుతం తన పీరియాడిక్ డ్రామా చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత రెండు వారాలుగా వార్తల్లో ఉంటోన్న ఈ దర్శకుడు గతేడాదే పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు టాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. 

అయితే ఇప్పుడు ఈ జంట సంతోషంగా లేరని సమాచారం. పెళ్లికి ముందే ఈ దర్శకుడు టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించారట. ఆ బ్యూటీ ఆయన తెరకెక్కించిన ఓ పీరియాడిక్ డ్రామాలో కూడా నటించిందని తెలుస్తోంది. ఆ సినిమా నుండి వీరిద్దరూ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నారని టాక్. ఈ ఎఫైర్ గురించి తెలుసుకున్న డైరెక్టర్ గారి భార్య అతడిపై నిఘా పెట్టి ముంబైలో సదరు డైరెక్టర్ హీరోయిన్ తో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందట.

ఇక అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ కు పెద్ద ఫ్యామిలీల సపోర్ట్ ఉండడంతో ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చూస్తున్నారు.  

loader