Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ .. దినం భోజనాల గోల, కామన్ సెన్స్ లేదే

కృష్ణంరాజు మీద అభిమానంతో.. తమను చూడటానికి వస్తున్న జనాలను సాధరంగా ఆహ్వానించి.. కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని ప్రభాస్‌, ఇతర కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుని అమలు చేసారు. 

Tollywood dinam Bhojanala Comparisons, very disgusting
Author
First Published Nov 30, 2022, 4:58 PM IST

తెలుగు పరిశ్రమలో గత ఈ మూడు నెలలో ఇద్దరు లెజండ్స్ మృతి చెందారు. వారు రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ. వారి దిన,వార కార్యక్రమాలు వారి కుటుంబాలు బాధాతప్త హృదయాలతో చేసారు. అలాగే ఈ లెజండ్స్ కు చెందిన అభిమానలకు , కుటుంబాలకు అందరిలాగే దినం భోజన కార్యక్రమాలు నిర్వహించారు. సెలబ్రెటీలు కావటంతో భారీగా విందు చేసారు. ఎంత విందు చేసినా, ఏం పెట్టినా అందరూ విచార హృదయాలతో పెట్టే భోజనం అది. దినం భోజనాలే అంటారు.

అంతవరకూ బాగానే ఉంది.కానీ ఇప్పుడు వీరి ఇద్దరి భోజనాలు కు సంబందించిన డిస్కషన్ చాలా  ఛండాలంగా ఉంది. సోషల్ మీడియాలో ఏ స్టార్ మృతికి ఎంత మంది వచ్చి భోజనం చేసారో, ఎంత ఖర్చు చేసారో ఆ వివరాలు అంటూ షేర్ చేస్తూ కొందరు దురాభిమానులు...ఒకరినొకరు ట్రోల్  చేసుకుంటున్నారు. ఇది చూసే వారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. 

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు  కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామం మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు ప్రభాస్‌, కృష్ణంరాజు అభిమానులు.. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారని తెలుస్తోంది. ఇక వీరందరికి ప్రభాస్‌ కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. కృష్ణంరాజు మీద అభిమానంతో.. తమను చూడటాని వస్తున్న జనాలను సాధరంగా ఆహ్వానించి.. కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని ప్రభాస్‌, ఇతర కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుని అమలు చేసారు.  ఆ  విందులో రక రకాల నాన్‌ వెజ్‌ .వెజ్‌ వంటలు వడ్డించారని ఆ నాలుగు రోజులు మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి.

మరో వైపు హైదరాబాద్‌లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించిన మహేష్ బాబు.. అభిమానుల కోసం విందు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్‌లో విందు ఏర్పాటుచేసిన సూపర్ స్టార్.. అభిమానులకు జేఆర్సీ కన్వెన్షన్‌ను కేటాయించారు. అక్కడ 32 రకాల వంటకాలతో అభిమానులకు విందు భోజనం ఏర్పాటుచేశారు. అంతేకాకుండా, జేఆర్సీ కన్వెన్షన్‌కు వెళ్లి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని కోరారు. ఎవరి ఇంట భోజనం వారిదే. ఈ దిన భోజనాలు ఎక్కడ ఎవరు ..ఎంతంత పెట్టారు..ఎంత మంది హాజరయ్యారు వంటి విషయాలు వినటానికే ఇబ్బందిగా ఉంటాయనేది నిజం. వీటిపై సోషల్ మీడియా చర్చ ఆపితే బాగుండును.
 

Follow Us:
Download App:
  • android
  • ios