దర్శకుడు పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ కలిసి ఉంటారు. వీరిద్దరూ నిర్మాణ భాగస్వాములుగా పూరి కనెక్ట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే పూరి, ఛార్మి మధ్య ఏదో నడుస్తోంది అని టాక్. ఇదే విషయమై పూరి భార్య లావణ్య ఛార్మిని నిలదీసినట్లు వార్తలు వస్తున్నాయి. నా భర్త పూరి జగన్నాధ్ తో నువ్వు కలిసి ఎందుకు ఉంటున్నావ్ అని లావణ్య ఛార్మిని నిలదీశారట. 


అయితే పూరి-ఛార్మి బంధం ఇప్పటిది కాదు. దాదాపు ఆరేళ్లుగా వీరు కలిసి పనిచేస్తున్నారు. అంతకు ముందే డైరెక్టర్,  ఆర్టిస్ట్ గా వారికి పరిచయం ఉంది. ప్రస్తుతం పూరి, ఛార్మి సహనిర్మాతలు. పూరి కోసం అనేక ఆర్థిక ఇబ్బందులు ఆమె ఎదుర్కొన్నారు. కాగా రోజులో ఎక్కువ సమయం  ఛార్మితో గడుపుతున్న పూరిని భార్య లావణ్య నిలదీశారట.  అలాగే ఛార్మితో పూరీని పెళ్లి చేసుకోమని చెప్పారట. 

ఇండస్ట్రీలో అందరూ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఇంకెందు పెళ్లి చేసుకోండి అని లావణ్య అన్నారట. ఓ విధంగా ఛార్మిపై లావణ్య దారుణంగా కోప్పడ్డారు అనేది టాక్. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. పూరి లావణ్యలది లవ్ మ్యారేజ్.  అప్పటికి దర్శకుడిగా అంత గుర్తింపు తెచ్చుకొని పూరి మొదటి చోపులోనే లావణ్య ప్రేమలో పడ్డాడట. అలాగే వీరి పెళ్ళికి పెద్దలు చాలా ఆటంకాలు సృష్టించారని సమాచారం.