ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. సంక్రాంతి రిలీజ్ అంటూ చమత్కారంగా పోస్ట్ పెట్టాడు. 

కమెడియన్ రాహుల్ రామ‌కృష్ణ తండ్ర‌య్యారు. సోషల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్లడించారు. సంక్రాంతి పండగరోజు రామకృష్ణ ఇంట నిజమైన పండగవాతావరణం వెల్లివిరిసింది. త‌న సోషల్ మీడియా ద్వారా సంతోషాన్ని పంచుకున్న రాహుల్.. సంక్రాంతి పండుగ రోజున కొడుకు పుట్టాడ‌ని తెలిపారు. సంక్రాంతి రిలీజ్ అంటూ తన కొడుకు ఫోటోని ట్విట్టర్ లో శేర్ చేశారు స్టార్ కమెడియన్ 

త‌ల్లికి ద‌గ్గ‌రగా ఉండి.. హాయిగా నిద్రిస్తున్న పసిపిల్లాడి ఫొటోతో పాటు ఈ కామెంట్ ను కూడా ఆడ్ చేశాడు రాహుల్ రామకృష్ణ. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాహుల్ పోస్ట్ కు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రాహుల్ రామ‌కృష్ణ‌కు కంగ్రాట్యులేష‌న్స్ చెబుతున్నారు

Scroll to load tweet…

లాస్ట్ ఇయర్ తన భార్యను పరిచయం చేశారు రాహుల్ రామకృష్ణ. తన భార్య‌ ను ప‌రిచ‌యం చేస్తూ ఆమెతో లిప్ లాక్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి.. సంచలనం అయ్యారు రాహుల్ రామ‌కృష్ణ‌. అప్పట్లో ఈ ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై కొంద‌రు నెటిజ‌న్స్ ట్రోల్ చేశారు కూడా. మ‌రికొంద‌రు ఆయన్ను సపోర్ట్ చేస్తూ.. విషెష్ కూడా చెప్పారు. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడో తెలియదు కాని.. తాను తండ్రి కాబోతున్నట్టు మాత్రం లాస్ట్ నవంబర్ లో వెల్లడించాడు రాహుల్. 

సడెన్ గా తనభార్య ప్రెగ్నెంట్ అంటూ.. అంద‌రికీ షాకిచ్చారు రాహుల్‌. మా లిటిల్ ఫ్రెండ్‌కి హాయ్ చెప్పండి అంటూ త‌న భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోను షేర్ చేశారు రామకృష్ణ. ఎప్పుడు పెళ్ళి చేసుకున్నావ్ గురు అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం కొడుకు పుట్టాడంటూ న్యూస్‌ను చెప్పేశాడు.