ప్రముఖ తెలుగు హాస్యనటి గీతాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ పెద్ద కొడుకు మరణిచాడు. ఈ సంఘటనతో తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది గీతాసింగ్.

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసవిషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ పెద్దకుమారుడు మరణించాడు. ఈ విషయాన్ని టాలీవుడ్ యాక్ట్రస్ కరాటే కళ్యాణి తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించింది. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు కంట్రోల్ లో ఉండకపోతే ప్రమాదాలలో ప్రాణాలుకోల్పోవలసి వస్తుందన్నారు. గీతాసింగ్ కొడుకు కూడా ఇలా ప్రమాదంలోనే కన్నుమూసినట్టు తెలిపారు. 

అయితే గీతాసింగ్ కు ఇంకా పెళ్లి కాలేదు. తన తోడబుట్టిన అన్న మరణించడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను ఆమె తీసుకున్నారు. వారితో పాటు మారో పాపను కూడా ఆమె పెంచుకుంటున్నారు. ఆ ముగ్గురు లోకంగా బ్రతుకుతున్న ఆమెకు సినిమా అవకాశాలు కూడా లేవు. ఈక్రమంలోనే ఈ విషాదం గీతాసింగ్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. గీతాసింగ్ పెద్ద కుమారుడు శుక్రవారం సాయంత్రం తన స్నేహితులతో కారులో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఈప్రమాదంలో అక్కడిక్కడే అతను మరణించినట్టు తెలుస్తోంది. 

ఇక గీతాసింగ్ కెరీర్ గురించి చూస్త.. ఆమెకు ప్రస్తుతం అవకాశాలు లేవు. కితకితలు సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా నటించి మెప్పించింది గీత. కితకితలు సినిమా తరువాత వరుస అవకాశాలు సాధించిందిలేడీ కమెడియన్. కాని రాను రాను ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అంతే కాదు.. సినిమాల ద్వారా సంపాధించిన ఆస్తిని కొందరు వ్యాక్తులనునమ్మి పోగొట్టుకున్నారు గీతాసింగ్. దాంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఆర్ధికంగా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.