పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం రాజకీయాలపైనే పెట్టాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో తన జనసేన పార్టీ తరఫున పవన్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం తన పార్టీ కోసం విరాళాలు సేకరిస్తున్నాడు.

ఈ క్రమంలో పవన్ అన్నయ్య నాగబాబు పార్టీ కోసం పాతిక లక్షలు డొనేట్ చేయగా, హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ కోసం ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఇక త్వరలోనే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడా భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని ఆయన చేరడానికి ముందే భారీ మొత్తంలో తమ్ముడి పార్టీకి విరాళాలు ఇవ్వబోతున్నారని టాక్. కేవలం మెగా ఫ్యామిలీలో హీరోలు మాత్రమే కాకుండా.. కుర్ర  హీరోలు నితిన్, నిఖిల్ వంటి వారు కూడా పవన్ పార్టీకి విరాళాలు ఇవ్వబోతున్నారు.

పవన్ కి వీరాభిమానిని అని చెప్పుకునే నితిన్ సంక్రాంతికి ముందే పవన్ ని కలిసి జనసేన పార్టీకి ఫండ్ ఇవ్వబోతున్నాడట. హీరో నిఖిల్ కూడా విరాళం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. వీరితో పాటు కమెడియన్ షకలక శంకర్ కూడా తనకు తోచినంత జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నాడు.

చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టినప్పుడు టాలీవుడ్ నుండి పెద్దగా మద్దతు లభించలేదు. కానీ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీకి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి  భారీ మద్దతు లభిస్తోంది.   

జనసేనకు వరుణ్, నాగబాబు విరాళాలు!