దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్యుల నుంచి సినీ తారల వరకు తమ తోబుట్టువుల కోసం ప్రేమగా రాఖీలు కట్టారు.
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్యుల నుంచి సినీ తారల వరకు తమ తోబుట్టువుల కోసం ప్రేమగా రాఖీలు కట్టారు. అక్కా చెల్లెల్లు..తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి నుంచి ఆశీర్వాదాలు, బహుమతులు అందుకోవడం రాఖీ పండుగలో కనిపించే అందమైన దృశ్యాలు.
చాలా మంది సినీ తారలు తమ రాఖీ పండుగ సెలెబ్రేషన్స్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. టాలీవుడ్ లో నిహారిక, చిన్నారి అల్లు అర్హ, రాశీ ఖన్నా, జబర్దస్త్ రీతూ చౌదరి, శ్రీముఖి లాంటి వారంతా తమ సోదరులకు రాఖీలు కట్టిన అందమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిహారిక కొణిదెల తన సోదరుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి రాఖీ కట్టింది. అనంతరం వరుణ్ తేజ్ పాదాలకు నమస్కరించిన నిహారిక అన్నయ్య నుంచి ఆశీర్వాదం అందుకుంది. ఈ అందమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలాగే యాంకర్ శ్రీముఖి, జబర్దస్త్ రీతూ చౌదరి తమ సోదరులకు సాంప్రదాయ బద్దంగా రాఖీ కట్టారు. హారతులిచ్చి ఆశీర్వాదం అందుకున్నారు.ఇక అల్లు అర్జున్ కుటుంబంలో కూడా రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నారి అల్లు అర్హ..తన సోదరుడు అల్లు అయాన్ కి రాఖీ కట్టింది. ఈ క్యూట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో క్రేజీగా మారాయి.
బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా రాఖీ పండుగని తన సోదరులతో ఎంతో ఘనంగా జరుపుకుంది. అల్లరిగా, హ్యాపీగా తన తమ్ముళ్లు, అన్నలతో పూజా హెగ్డే రాఖీ సంబరాల్లో రచ్చ చేసింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రాఖీ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. రక్షా బంధన్ సందర్భంగా చిరంజీవి చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు ఆయనకి రాఖి కట్టారు. అన్నయ్యకి ప్రేమతో భక్తి శ్రద్దలతో వీరిద్దరూ రాఖీ కట్టి చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోలని చిరు సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
