నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో సైరా చిత్రాన్ని ప్రజెంట్ చేశాడు. చిరంజీవి నటన, యాక్షన్ సన్నివేశాలు, తమన్నా పెర్ఫామెన్స్, ఎమోషనల్ సీన్స్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. 

సైరా చిత్రం విజయంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. హరీష్ శంకర్, సుధీర్ బాబు లాంటి సెలబ్రిటీలు సైరా చిత్రం చూశాక వారి అభిప్రాయాన్ని తెలిపారు. 

చరిత్ర మళ్ళీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది. సురేందర్ రెడ్డి అద్భుతమైన పనితనం కనబరిచారు. సైరా నిర్మాత రాంచరణ్ కు హ్యాట్సాఫ్. మెగాస్టార్ కు శిరస్సు వంచి వందనాలు' అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. 

 

అల్లు శిరీష్ సైరా చిత్రం చూశాక తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ముందు మన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాడారు. చరిత్ర మరచిన లాంటి వీరుడి కథని మాకు అందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి, రాంచరణ్, సురేందర్ రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి, అదే సమయంలో కంటతడి కూడా పెట్టాను. చిరంజీవి, అమితాబ్, కిచ్చా సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి, నయనతార లాంటి గొప్ప నటులందరికి ఒకే స్క్రీన్ పై చూడడం సంతోషించదగ్గ విషయం. ఈ విజువల్ వండర్ ని తెరక్కించిన సురేందర్ రెడ్డికి, సైరా టీం కి హ్యాట్సాఫ్. 

సైరా నరసింహారెడ్డి చిత్రం ఎమోషన్స్ తో కూడిన మంచి అనుభవం. మెగాస్టార్ చిరంజీవి ఒక లెజెండ్. ఇంటర్వెల్ సన్నివేశం నేను చూసిన వాటిలో ది బెస్ట్. రాంచరణ్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. 

 

సైరా చిత్రం చాలా బాగా నచ్చింది. అద్భుతమైన యాక్షన్ డ్రామాతో దర్శకుడు సురేందర్ రెడ్డి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. తమన్నా నటనతో ఆకట్టుకుంది అని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.