ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 విజయవంతమైంది.  విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగింది. దీంతో భారతీయులు గర్విస్తున్నారు. ఇటు సినీ తారలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చరిత్ర సృష్టించింది. గతనెలలో ప్రారంభమైన చంద్రయాన్3 ఈరోజు విజయవంతమైంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ దిగింది. ఉత్కంఠగా ఎదురుచూసిన భారతీయులు Chandrayaan 3 విజయవంతం పట్ల గర్విస్తున్నారు.. ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రౌడ్ మూమెంట్ పట్ల టాలీవుడ్ ప్రముఖులు, అగ్ర స్థాయి హీరోలు, సెలబ్రెటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కామెంట్స్ తో ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

చంద్రయాన్3 విజయవంతంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీటర్ వేదికన స్పందించారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. భారతదేశానికి ఇదోక గొప్ప విజయం. ఈరోజు చంద్రయాన్3 అపూర్వమైన, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. చరిత్ర సృష్టించింది. మన ఇండియన్ స్టైంటిఫిక్ కమ్యూనిటి సాధించిన విజయాన్ని కోట్ల భారతీయులతో కలిసి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అలాగే వారి అభినందనలు తెలుపుతున్నాను. ఈ విజయంతో చంద్రునిపై మరిన్ని ఆవిష్కరణలకు, రాబోయే రోజుల్లో చేయబోయే శాస్త్రీయ మిషన్లకు మార్గం సుగమం చేసింది. ఇక చంద్రుడిపై హాలీడే జరుపుకునే రోజు ఇంకెతో దూరం లేకపోవచ్చు.’ అని చెప్పుకొచ్చారు. 

Scroll to load tweet…

ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Raja mouli) స్పందిస్తూ... ‘చంద్రుడిపై భారత్’ అంటూ ఒక్క మాటలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రోకు ధన్యవాదాలు తెలిపారు. జక్కన ‘ఆర్ఆర్ఆర్’తో ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డు భారత్ సొంతం చేసేందుకు కృషి చేసి.. భారతీయులను గర్వించేలా చేసిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇస్రోకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిని చేరుకోవడం పట్ల సంతోషించారు. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌తో అద్భుతమైన విజయం సొంతం కావడంతో పాటు భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో భారీ ముందడుగు పడిందని తెలిపారు. ఇస్రో పరిశోధకుల డెడికేషన్, బ్రిలియన్స్ ను ప్రశంసించారు. ఈ గొప్ప విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. 

Scroll to load tweet…

చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్తలు అంటూ నందమూరి బాలకృష్ణ (Balakrishna) చంద్రయాన్3 విజయంతం పట్ల ప్రశంసలు కురిపించారు. చంద్రుని దక్షణ ధృవం పై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ముందడుగు వేశారన్నారు. చంద్రుడుపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబందించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో ఇండియా ముందుంటుందన్నారు. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించాలని కోరుకుంటున్నాను. 140కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన శాస్త్రవేత్తలకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR) చంద్రయాన్3 విజయవంతంపై స్పందించారు. ట్వీటర్ వేదికన ఇస్రోకు అభినందనలు తెలిపారు..... ఇస్రోకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చంద్రుని ఉపరితలంపై #Chandrayan3 మిషన్ విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్‌ గొప్ప విజయం. ఇది భారతదేశానికి గర్వకారణం.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

కింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇస్రో శాస్ర్తవేత్తలతో పాటు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా మనం ఇప్పుడు చంద్రుడిపై ఉన్నామని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా విక్రమ్ చంద్రుడిపై ల్యాండ్ అయిన క్షణాల్లోనే స్పందించారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులకు ఇది గర్వించే క్షణమన్నారు. చంద్రయాన్3 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఘనత తొలిసారిగా ఇండియా సాధించడం విశేషమైనదన్నారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

ఇండియా చరిత్ర సృష్టించందటూ నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గర్వించారు. ఇస్రో సాధించిన విజయవంతానికి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం పట్ల ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతోందని... జైహింద్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక యంగ్ హీరో నితిన్ (Nithiin), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…