Asianet News TeluguAsianet News Telugu

#Baby హిందీ రీమేక్ ఖరారు.. హీరో, డైరక్టర్ డిటేల్స్


 'బేబీ' బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్​ సాధించి రికార్డు కొట్టింది. ఇప్పుడు  రీమేక్ కు రెడీ అయ్యింది.

Tollywood Blockbuster #Baby to be remade in Hindi? jsp
Author
First Published Oct 31, 2023, 11:21 AM IST

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబి. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం జులై 14న థియేటర్స్ లో రిలీజై, సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  బేబీ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి బేబీ టీం ను అప్రిషియేట్ చేసారు. థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడ్డ ఈ చిత్రం ఓటిటిలోనూ హై సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రీమక్  రైట్స్ కు ఓ రేంజి డిమాండ్ ఏర్పడటంలో వింతేమీలేదు. తాజాగా హిందీ చిత్రం రీమేక్ లాక్ అయ్యిందని మీడియా వర్గాల సమాచారం.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని హిందీలో సాయి రాజేష్ డైరక్ట్ చేయబోతున్నారట. బాబీ డయోల్ కుమారుడు ఆర్యమాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయనున్నారు. అలాగే హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని ప్రయత్నిస్తారట. సాయి రాజేష్ ఈ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేయబోతున్నారని, బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుందని, త్వరలోనే ఎనౌన్స్మెంట్ వస్తుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం షూట్ మొదలు కానుంది. అయితే ఇదేమీ అఫీషియల్ గా ప్రకటించిన సమాచారం కాదు. దర్శక,నిర్మాతలు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'బేబీ' సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు సాయి రాజేశ్ గతంలో తెలిపారు. " తెలుగులో తీసిన విధంగా బాలీవుడ్​లో వర్కౌట్ కాకపోవచ్చు. నార్త్ ఆడియెన్స్​ అభిరుచికి అనుగుణంగా కథలో మార్పులు చేయాల్సి ఉంటుదని మేము భావిస్తున్నాం" అని రాజేశ్ అన్నారు. ఇక యువతకు సంబంధించిన స్టోరీ కాబట్టి ఈ సినిమా అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని మూవీ మేకర్స్ నమ్ముతున్నారు. 

బేబి  సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ నిర్మిచారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాగా నిర్మించబడి, కలెక్షన్స్ లో మాత్రం పెద్ద సినిమాను తలపించింది. అయితే ఒక పక్క కలెక్షన్స్ లో దూసుకుపోతూనే పలువురు సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంషలు కూడా అందుకుంది.  బేబీ రీమేక్ రైట్స్ కోసం పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇస్తామని ఆఫర్ చేస్తుండటంతో ఎస్ కే ఎన్ నే స్యయంగా  తమిళ్ లో సినిమాను తీయాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు   టాక్ వినిపిస్తోంది. 

చిత్రం స్టోరీ లైన్ సింపుల్...బస్తీలో పెరిగే అమ్మాయి, అక్కడ అబ్బాయిని ప్రేమిస్తుంది, అతన్నే పెళ్లి చేసుకుంటాను అనుకుంటుంది. ఆ అబ్బాయి పదవతరగతి తప్పినా, అతన్నే ఇష్టపడుతుంది. అయితే ఈ బస్తీ అమ్మాయి కాలేజీకి వెళ్లేసరికి ఆమె ఆలోచన ధోరణి మారుతుంది. అక్కడ పరిస్థితులు, మిగతా అమ్మాయిలు, అబ్బాయిలను చూసి ఆమె వాళ్ళతో సమానంగా మారిపోతుంది. ఎంతో అమాయకంగా, ఏమీ తెలియనట్టు ఉంటే ఒక బస్తీ అమ్మాయి, పూర్తిగా మారిపోతుంది. ఆధునికంగా తయారవుతుంది, కొత్త అలవాట్లు నేర్చుకుంటుంది, ఆ సమయంలో తప్పులు చేస్తుంది. తరువాత గందరగోళంలో పడుతుంది. స్కూల్ నుండి ప్రేమిస్తున్న బస్తీ అబ్బాయిని వదులుకోవాలా, లేదా కాలేజీలో కొత్తగా పరిచయం అయిన ధనవంతుడి కొడుకుతో ఉండాలా, ఇలా ఆలోచిస్తూ ఆమె చివరికి ఏమి చేసింది అన్నది కథ. దర్శకుడు సాయి రాజేష్ బలమైన పాయింట్ రచన. ఈ సినిమాకి మాటలు చాలా బాగా రాసాడు, దానికి తోడు సంగీతం కూడా సరిగా కుదిరింది.

Follow Us:
Download App:
  • android
  • ios