టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో తనను లిప్ కిస్ అడుగుతారని ఎదురుచూస్తోందట నటి తమన్నా.. ఇదంతా సినిమా కోసమేలెండి. కథ డిమాండ్ చేస్తే లిప్ కిస్ పెట్టడానికి రెడీ అంటూ చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కొందరు మాత్రం బోల్డ్ సీన్స్, లిప్ లాస్ సన్నివేశాల్లో నటించమని తేల్చి చెప్పేస్తుంటారు.

కానీ మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయని, ఇది మంచి మార్పని అంటోంది తమన్నా. తనకు కూడా అటువంటి బోల్డ్ కథల్లో నటించాలని ఉందని కానీ తన వద్దకు అలాంటి కథలతో ఎవరూ రాలేదని చెబుతోంది.

బోల్డ్ కంటెంట్ అంటే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి మీకు ఓకేనా అని ప్రశ్నిస్తే.. 'అదే కదా నేను చెబుతోంది' అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు తనను ఏ దర్శకుడు లిప్ లాక్ కోసం డిమాండ్ చేయలేదని, ఇప్పుడు టాలీవుడ్ లో కథల ఫార్మాట్ మారింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా లిప్ కిస్ అడుగుతారని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

అయితే లిప్ లాక్ సీన్ ని మాత్రం కథ డిమాండ్ చేయాలని అంటోంది. ప్రస్తుతం తమన్నా నటించిన 'నెక్స్ట్ ఏంటి?' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉంది తమన్నా.