నిన్న మొదలైన మెహబూబ్ టీమ్, అభిజిత్ టీం టాస్క్  నేడు కూడా కొనసాగుతుంది. సరైన ఆహారం లేక మెహబూబ్ టీమ్ కొంచెం వీకైనట్లు కనిపిస్తున్నారు. దీనితో అర్థ రాత్రి అభిజిత్ టీమ్ వేసిన ట్రాప్ లో మెహబూబ్ టీమ్ లో ఉన్న దివి చిక్కుకున్నారు. నమ్మించి వాష్ రూమ్ కి వెళ్లేలా దివిని చేసిన అభిజిత్  టీమ్, వారి అధీనంలో ఉన్న రూమ్ లోకి రాగానే కిడ్నాప్ చేశారు. 

టాస్క్ లో మెహబూబ్  టీం ఫెయిల్ అయ్యేలా దివికి ముక్కు అవినాష్ అన్నం తినిపించే ప్రయత్నం చేశారు.  అలాగే ఆమె నుండి ఛార్జ్  తీసుకున్నారు. దీనితో ఇంటి వరండాలో ఉన్న అభిజీత్ టీమ్ సభ్యుల రోబో ఫ్రేమ్స్ కి ఛార్జ్ వచ్చి చేరింది. 

అర్థరాత్రి అభిజిత్  టీమ్ ఇచ్చిన దెబ్బకి మెహబూబ్ టీమ్ షాక్ తిన్నారు. అభిజిత్ టీమ్ పై కోపంతో ఉన్న మెహబూబ్ టీమ్ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అభిజీత్ అధీనంలో ఉన్న గదిలోకి వెళ్ళడానికి మెహబూబ్ టీమ్ కి బిగ్ బాస్ యాక్స్ స్ ఇవ్వలేదు. దీనితో మెహబూబ్ టీమ్ లో ఉన్న సోహైల్, మెహబూబ్, మోనాల్, నోయెల్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయాలని మోనాల్, సోహైల్, బిగ్ బాస్ ని కోరారు. 

సోహైల్ ఎవరిని పర్మిషన్ అడిగి దివిని ఇంటిలోకి పంపారని కోప్పడ్డారు. ముఖ్యంగా మెహబూబ్ పై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెహబూబ్ కూడా ఆడవాళ్లను కిడ్నాప్ చేస్తారా, దమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయాలని విసిరారు. 

సోహైల్, మెహబూబ్ అభిజిత్ టీమ్ లో ఉన్న కుమార్ సాయిని హెచ్చరించారు. మొత్తంగా మెహబూబ్ టీం సభ్యులు తీవ్ర కోపానికి గురయ్యారు. మోనాల్, మెహబూబ్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ టాస్క్ లో అభిజిత్ టీం గెలిచే అవకాశము దీని వలన దక్కించుకున్నారు. ఫైనల్ గా బిగ్ బాస్ డెసిషన్ ఏమిటో చూడాలి. రోబోలుగా ఉన్న అభిజిత్ టీం సభ్యులు ఫుల్ ఛార్జ్ అయ్యారు. 

ఇక కిడ్నాప్ చేయబడిన దివిని కాసేపటి తరువాత అభిజీత్ టీమ్ వదిలిపెట్టింది. మెహబూబ్ టీం సభ్యులు దివిని ఎవరెవరు ఏమి చేశారని అడిగి కనుక్కున్నారు. దివి తనను పట్టుకున్న వారి పేర్లతో పాటు, తనకు అన్నం పెట్టారని చెప్పింది. ఈ టాస్క్ ఇంకా పూర్తి కాలేదు రేపు కూడా నడుస్తుంది. 

అర్థరాత్రి అభిజిత్  టీమ్ ఇచ్చిన దెబ్బకు  మెహబూబ్ టీమ్ షాక్ తిన్నారు. అభిజిత్ టీమ్ దివిని కిడ్నాప్ చేయడం జరిగింది. అభిజిత్ టీమ్ అధీనంలో ఉన్న గదిలోకి వెళ్ళడానికి మెహబూబ్ టీమ్ కి బిగ్ బాస్ యాక్స్ స్ ఇవ్వలేదు. దీనితో మెహబూబ్ టీమ్ లో ఉన్న సోహైల్, మెహబూబ్, మోనాల్, నోయెల్ తీవ్ర అసహనానికి గురయ్యారు.