విషాదం.. ‘టైటానిక్’ నటుడు మృతి.. ఆలస్యంగా వెలుగులోకి.. ఎలా చనిపోయారంటే?
ప్రముఖ నటుడి మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ;ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ యాక్టర్ తాజాగా కన్నుమూయడంతో అందరూ నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. దిగ్గజ నటులు ఒక్కొక్కరుగా తుదిశ్వాస విడుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ దిగ్గజాలు నింగికెగిసిన విషయం తెలిసిందే. ఇక హాలీవుడ్ లోనూ వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్యలో హ్యారీపోటర్ నటుడు, రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ నటుడు మరియు థోర్ రే స్టీవెన్సన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా కన్నుమూశారు.
తాజాగా టైటానిక్ నటుడు లేవ్ పాల్టర్ కన్నుమూశారు. ఇయన 94 ఏటా తుదిశ్వాస విడిచారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల్టర్ నెల కిందనే మరణించారు. మే 21న లాస్ ఏంజెల్స్ లోని తన ఇంట్లోనే మరణించారు. అయితే ఈ విషయం ప్రపంచానికి తెలియడం ఆలస్యం అయ్యింది. స్వయంగా తన కూతురు కేథరీన్ పాల్టర్ మీడియాతో వెల్లడించడంతో తెలిసింది.
లేవ్ పాల్టర్ 1928 నవంబర్ 3న న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో జన్మించారు. ఆయన పూర్తి పేరు లియోన్ లూయిస్ పాల్టర్. కాగా చిన్నప్పటి నుంచే పాల్టర్ కు నటనపై ఆసక్తి ఎక్కువ. దీంతో రంగస్థలం నటుడిగా కెరీర్ ను ప్రారంభించారు. మెళ్లిగా సినిమా రంగంలోకి ప్రవేశించారు. అలాగే టీవీ ప్రొగ్రామ్స్ లోనూ వర్క్ చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ సినిమాలో డిపార్ట్ మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇస్డోర్ స్ట్రాస్ రోల్ లో అందరినీ ఆకట్టుకున్నారు.
ఆయన నటకు మంచి గుర్తింపు దక్కింది. 1997లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించి ప్రముఖ నటుల జాబితాలో చేరారు. ఇదిలా ఉంటే.. లేవ్ పాల్టర్ మరణవార్త అందరినీ బాధిస్తోంది. ఆయన లంగ్ క్యానర్స్ తో మరణిచినట్టు కూతురు తెలిపారు.