Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 30 అప్డేట్ టైమ్ ఫిక్స్డ్... ఫ్యాన్స్ ఎదురుచూపులు!

నేడు సాయంత్రం 7:00 గంటలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనితో నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అలాగే చాలా కాలం  ఎదురుచూసేలా చేశారు కాబట్టి, సాలిడ్ అప్డేట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

time fixed for ntr 30 update fans eagerly  waiting for ksr
Author
Hyderabad, First Published Apr 12, 2021, 12:53 PM IST

ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. 2018 అక్టోబర్ లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ విడుదల కావడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ కారణంగా 2019, 2020 ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా రాకుండా ముగిశాయి. 2019 చివర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ తన 30వ చిత్రం ప్రకటించారు. 


ఆ మూవీ 2020 సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్ళాలి. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల 2020 జనవరిగా ప్రకటించగా తక్కువ వ్యవధిలో ఎన్టీఆర్ నుండి రెండు సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ ఆశపడ్డారు. వారి ఆశలపై కోవిడ్ నీళ్లు చల్లింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిలిచిపోవడంతో విడుదల తేదీ అక్టోబర్ 2021కి వెళ్ళింది. త్రివిక్రమ్ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎన్టీఆర్ 30పై అప్డేట్ కావాలని ఫ్యాన్స్ అడుగుతున్న నేపథ్యంలో నేడు ముహూర్తం ఖరారు చేశారు. 


నేడు సాయంత్రం 7:00 గంటలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనితో నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అలాగే చాలా కాలం  ఎదురుచూసేలా చేశారు కాబట్టి, సాలిడ్ అప్డేట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్థినకు అంటే టైటిల్ ప్రచారంలో ఉంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios