సోషల్ మీడియా వేదిక సెలబ్రిటీలకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు తమ అనుభవాలను తమకు ఎదురైన ఇబ్బందులను వేదింపులను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తుండగా, మరికొందరికి ఫన్నీ ఇన్సిడెంట్స్‌ ఎదురువుతున్నాయి. తాజాగా అలాంటి అనుభవమే నటి తిలోత్తమా షోమ్‌కి ఎదురైంది. 42 ఏళ్ల ఈ నటికి ఓ అభిమాని వింత ప్రతిపాదన చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన తిలోత్తమ తరువాత ఆసక్తికరంగా స్పందించింది.

అసలు విషయానికి వస్తే తిలోత్తమకు సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని ఓ మేసేజ్ చేశాడు. `నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నా జీవితాంతం మీకు తోడుగా ఉంటాను. నేను వర్జిన్‌, శాఖాహారిని కూడా కావాలంటే వర్జినిటీ టెస్ట్‌ చేసుకోండి, లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి, బ్రైయిన్‌ మ్యాపింగ్ టెస్ట్ అయినా చేసుకోండి` అంటూ మెసేజ్‌ చేశాడు.

అయితే ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్‌  చేసిన తిలోత్తమ ఆస్తకికరంగా స్పందించింది. `ఈ శాఖహార జోక్‌ ఎంటీ బ్రదర్‌..? అవసరం లేదు.. బైబై` అంటూ రిప్లై ఇచ్చింది తిలోత్తమ. పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తిని ఒక్క మాటలో భాయ్‌ అంటూ కట్‌ చేసింది తిలోత్తమ. అయితే ఈ మేసేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ మెసేజ్‌పై రియాక్ట్ అవుతున్నారు.