Asianet News TeluguAsianet News Telugu

వాస్తవాలను వక్రీకరించారు : విద్యాబాలన్ ‘‘షెర్నీ’’ చిత్రబృందానికి.. పులిని చంపిన షూటర్ అస్గర్ నోటీసులు

బాలీవుడ్ అగ్రకథానాయక విద్యాబాలన్ నటించిన షేర్నీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఊహించని పరిణామాం ఎదురైంది. పులి అవనిని చంపిన షూటర్ అస్గర్ అలీ ఈ సినిమా దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు.

Tigress Avni killer Asghar Ali Khan serves notice on Sherni filmmakers ksp
Author
Mumbai, First Published Jun 21, 2021, 10:38 AM IST

బాలీవుడ్ అగ్రకథానాయక విద్యాబాలన్ నటించిన షేర్నీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఊహించని పరిణామాం ఎదురైంది. పులి అవనిని చంపిన షూటర్ అస్గర్ అలీ ఈ సినిమా దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. ‘‘షేర్ని’’ సినిమాలో వాస్తవాలు వక్రీకరించబడ్డయాని తెలిపారు. మహారాష్ట్రలోని యావత్మల్‌లో ‘‘అవని’’ అనే పులిని అస్గర్ 2018లో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఆధారంగా షెర్నీని నిర్మించారు. 

సదరు నోటీసులో అస్గర్ ఇలా అన్నారు. షెర్ని చిత్రం.. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలిగించడంతో పాటు తమ ప్రతిష్టకు, హక్కులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. షఫత్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఈ కథ కల్పితమని చిత్ర యూనిట్ చెబుతున్నప్పటికీ వాస్తవాలను వక్రీకరించారు. షెర్నీ చిత్రం ద్వారా కోర్టులో దాఖలైన పిటిషన్‌ను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Also Read:ఆ ఛాన్స్ వస్తుందనుకోలేదు.. అదే నా మొదటి సంపాదనః విద్యాబాలన్‌

పులి బారి నుంచి ప్రజలను రక్షించడానికి అస్గర్ దానిని నాలుగు మీటర్ల దూరం నుంచి కాల్చి చంపాడని షఫత్ అలీఖాన్ తెలిపారు. అవని 14 మందిని చంపిందని.. తాను, అస్గర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లామని ఆయన వెల్లడించారు. షూటింగ్ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నాడు కోర్టులు కూడా నిరాకరించని విషయాన్ని షఫత్ గుర్తుచేశారు. అయినప్పటికి తమను కించపరచడానికి, జంతు హక్కుల కార్యకర్తల ఆదేశాల మేరకే ఈ చిత్రం నిర్మించారని ఆయన ఆరోపించారు. 

అస్గర్ నోటీసుపై స్పందించారు షెర్ని చిత్ర తయారీదారు అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. అస్గర్, అతని తండ్రి ఆరోపణలను ఖండించారు. షెర్నీ కల్పితమైన కథ అని.. ఇందులో అస్గర్, అతని తండ్రి షఫత్ అలీ ఖాన్‌ను తాము ఏ విధంగానూ చిత్రీకరించలేదని స్పష్టం చేశారు. షెర్నిలో అస్గర్, అతని తండ్రితో పోలికలు ఉన్నాయని నిరూపించడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios