బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రమాదానికి గురయ్యారు. మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్న టైగర్ ష్రాఫ్ హఠాత్తుగా గ్రౌండ్ లో పడిపోవడంతో అందరూ కంగారు పడ్డారు. టైగర్ ష్రాఫ్ నేలపై పడడంతో వెంటనే అక్కడ ఉన్న వైద్యులు ఆయనను పరీక్షించడం జరిగింది. అయితే టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలయ్యాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం.

 
వీకెండ్ కావడంతో సరదాగా టైగర్ ష్రాఫ్ ఫుట్ బాల్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో దిశా పటాని అక్కడే ఉండడం విశేషం. గ్రౌండ్ లో క్రింద పడిపోయిన టైగర్ ష్రాఫ్ ని చూసి దిశా కంగారు పడిపోయారట. స్టాండ్స్ లో ఉన్న ఆమె పరుగున గ్రౌండ్ లో ఉన్న టైగర్ ష్రాఫ్ దగ్గరికి వచ్చారట. ఆయనకు ఏమీ కాలేదని తెలుసుకొని కుదుట పడ్డారట దిశా పటాని. 


బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం టైగర్ ష్రాఫ్, దిశా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. తరచుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తారు. అయితే తాము డేటింగ్  చేస్తున్నట్లు ఇద్దరిలో ఎవరు ఓపెన్ అయిన దాఖలాలు లేవు. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. టైగర్ వికాస్ బాల్ దర్శకత్వంలో గణపత్ అనే మూవీ చేయాల్సి ఉంది.