Asianet News TeluguAsianet News Telugu

`టైగర్‌ 3` టైమ్‌ ఫిక్స్, ఓంకార్‌ `మన్షన్‌ 24` ఈ రాత్రి నుంచే.. క్లినిక్‌ ఓపెనింగ్‌లో `బేబీ` టీమ్‌

సల్మాన్‌ నటించిన `టైగర్‌ 3` చిత్ర విడుదల తేదీని కన్ఫమ్‌ చేసింది యూనిట్‌. అలాగే ఓంకార్‌ రూపొందించిన `మాన్షన్‌ 24` ఈ రాత్రి నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. మరోవైపు లేజర్‌ క్లినిక్‌ని `బేబీ`టీమ్‌ ప్రారంభించింది. 
 

tiger 3 trailer out mansion 24 streaming today night and baby team hulchul arj
Author
First Published Oct 16, 2023, 11:47 PM IST

`టైగర్‌ 3` ట్రైలర్‌ అదిరింది..

సల్మాన్‌ నటించిన `టైగర్‌` చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. ఇందులో మూడో సిరీస్‌ అవుతుంది. కత్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు.  నేడు `టైగర్‌ 3`  ట్రైలర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. దీపావళి సందర్భంగా సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ రూపొందించిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి వరుస హాలీడేస్‌ కలిసి వస్తున్నాయి. న‌వంబ‌ర్ 12 ఆదివారం అయితే, 13వ తేది అమావాస్య‌, న‌వంబ‌ర్ 14న గోవ‌ర్ధ‌న్ పూజ‌, గుజ‌రాతీల కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు ఉంటాయి. న‌వంబ‌ర్ 15న భాయ్ దూజ్ పండుగ ఉంది. ఇలాంటి హాలీడేస్ సంద‌ర్భంగా విడుద‌లవుతున్న టైగ‌ర్ 3’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తుంద‌ని టీమ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 

 ఓంకార్ `మాన్షన్ 24` ఈ రాత్రి నుంచే స్ట్రీమింగ్‌..

`రాజు గారి గది` సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి `మాన్షన్ 24` అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రేపటి (ఈ రోజు రాత్రి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. `మాన్షన్ 24`లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మాన్షన్ 24 ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌పై టీమ్‌ కాన్ఫిడెంట్‌ని వ్యక్తం చేసింది. దీనికి వరుసగా సిరీస్‌లు ఉంటాయని ఓంకార్‌ తెలిపారు. రెండో సిరీస్‌లో తమ్ముడు అశ్విన్‌బాబు కూడా నటిస్తాడట. 

స్కిన్ లేజర్, హెయిర్ క్లినిక్‌ని ప్రారంభించిన `బేబీ` టీమ్‌.. 

పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు, హెయిర్ ఫాల్స్ కి ఎక్కువగా గురవుతున్నారని సినీనటి వైష్ణవి చైత్యన అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన  సెలెస్టీ స్కిన్ లేజర్, హెయిర్ క్లినిక్‌ని `బేబీ` మూవీ హీరోహీరోయిన్లు ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య కలిసి ప్రారంభించారు. ఇందులో వైష్ణవి మాట్లాడుతూ, చర్మ వ్యాధుల్లో , హెయిర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు నగరంలో కూడా అందుబాటులోకి వచ్చాయని ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు, ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేదని అన్నారు.

అత్యాధునిక పరికరాలతో, ప్రపంచ స్థాయి వైద్యం అందించేందుకు సెలెస్టీ స్కిన్ లేజర్, హెయిర్ క్లినిక్‌ని   కోకాపేట్ లో ఏర్పాటుచేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులను అభినందించారు. నేటి యువత, మహిళలు స్కిన్‌కేర్‌ మరియు హెయిర్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర వాసుల అవసరాలు తీర్చేందుకు నగరంలో మరిన్ని శాఖలు తెరవనున్నామని నిర్వాహకులు డాక్టర్‌ రాజ్ కిరీటి , డాక్టర్ శ్రీదేవి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios