ప్రముఖ గణిత శాస్త్ర మేదావి శకుంతల దేవి కథతో అదే పేరుతో తెరకెక్కిన సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యింది.  అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సుధీర్ఘమైన శకుంతల దేవి కథను రెండు గంటల్లో అద్భుతంగా చూపించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి గణిత శాస్త్ర వేత్త శకుంతల దేవి కథతో ఈ సినిమాను రూపొందించారు.

అను మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోని పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ప్రొడక్షన్స్‌, విక్రమ్‌ మల్హోత్రాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో విద్యాబాలన్‌ నటించగా జిష్షు సేన్‌ గుప్తా, అమిత్ సాధ్‌లు కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శకురాలు అను మీనన్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

నాకు చాలా ఆనందంగా ఉంది. శకుంతల దేవికి రోజు రోజుకు వ్యూస్‌ పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో, గణితశాస్త్రలంలో ఎంతో కృషి చేసిన ఓ మహిళ నేపథ్యంలో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా చేయటం, ఆ సినిమా ఇతంటి విజయం సాధించటం మరింత ఆనందంగా ఉంది. అందరూ కుటుంబ సమేతంగా సినిమా చూస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హ్యూమన్‌ కంప్యూటర్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.` అని తెలిపారు.

అద్భుత మహిళ శకుంతల దేవి ఎంతో సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమస్యలను పెన్ను పేపర్‌ కూడా లేకుండా క్షణాల్లో సాల్వ్‌ చేసేది. దశాబ్దాల క్రితమే ఆమె దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో ప్రాచుర్యం పొందారు. దాదాపు 13 అంకెలున్న రెండు సంఖ్యల మల్టిప్లికేషన్‌ రిజల్ట్‌ను కేవలం 28 సెకన్లలో చెప్పి ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ను సైతం సాధించింది.