19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరింది. ఇక ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే డే కావడంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా ఉన్న అరియానా, అభిజిత్, అఖిల్, సోహైల్ మరియు హరికలలో ఒకరు విన్నర్ కానున్నారు. హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ స్టేజ్ ని టాలీవుడ్ స్టార్స్ పంచుకోనున్నారు. మరి ఈ ఐదుగురిలో ఎవరు విన్నర్ కానున్నారు అనే విషయంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మీడియా సంస్థలు కూడా అనేక్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. 
 
ఐతే హౌస్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యులలో ఇద్దరు ఫైనల్ రేసు నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్స్ నాలుగు, ఐదు స్థానాలకు పడిపోయారని సమాచారం. టాప్ ఫైవ్ కి చేరిన ఇద్దరు అమ్మాయిలు హారిక, అరియనా రేసులో వెనుక బడ్డారట. టాప్ ఫైవ్ లో అతి తక్కువ ఓట్లు పొందిన హారిక ఐదవ స్థానానికి, అరియనా నాలుగవ స్థానానికి పరిమితం అయ్యారట. 
 
కనీసం బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అయినా లేడీ కంటెస్టెంట్ గెలుచుకుంటుందని ఆశపడినవారికి నిరాశే ఎదురైనట్లు తెలుస్తుంది. ఇక టైటిల్ కోసం ముగ్గురు అబ్బాయిలు అఖిల్, సోహైల్ మరియు అభిజీత్ పోటీపడుతున్నారట. ఈ ముగ్గురు మధ్య టైట్ ఓటింగ్ నడుస్తుందట. రేపు రాత్రికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.