ఈవారం బిగ్ బాస్ కి కఠిన పరీక్ష ఎదురు కానుంది. ఏడువారాలుగా కొనసాగుతున్న బిగ్ బాస్ హౌస్ నుండి మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక మిగిలిన వారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్  అని చెప్పాలి. ఈ వారం నామినేటైన ఆరుగురిలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఆరియానా, మెహబూబ్, లాస్య, అమ్మ రాజశేఖర్, అఖిల్, మోనాల్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. 

ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ వారివారి ప్రత్యేకతలతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరిలో నుండి ఒకరిని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ కి పెద్ద పరీక్షే అనాలి. అఖిల్, మోనాల్ లలో ఎవరిని ఎలిమినేట్ చేసినా హౌస్ లో కొనసాగుతున్న లవ్ స్టోరీ మరియు రొమాంటిక్ యాంగిల్ మిస్ అవుతుంది. ఇక ఆరియానా జెన్యూన్ ప్లేయర్ గా ప్రేక్షకుల మద్దతు పొందారు. సమంత సైతం ఆరియానాను పొగడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఇక లాస్య, అమ్మ రాజశేఖర్ లకు మొదటి నుండి ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కుతుంది. ఇంటిలో ఉన్న సభ్యులలో అత్యధిక ఓట్లు దక్కించుకున్నటున్న కంటెస్టెంట్స్ గా వీరున్నారు. ఇక మిగిలిన మెహబూబ్ సైతం కంటెస్టెంట్స్ లో పోరాడే తత్త్వం కలవాడిగా, వివాదాలు రాజేస్తూ మంచి ఎంటర్టైనర్ గా ఉన్నాడు. ప్రతి ఒక్కరికీ కొన్ని  ప్లస్ పాయింట్స్ ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ ఇంటి నుండి ఈ వారం వీడేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది. 

ఇప్పటికే బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రేక్షకులలో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో మతలబు ఉందని, ఇది ఓట్ల ప్రకారం జరిగిన ఎలిమినేషన్ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతే మోనాల్ పై ప్రేక్షకుల్లో సదాభిప్రాయం లేదు. ఒకవేళ ఎలిమినేటైతే ఆమె కావచ్చని భావిస్తున్నారు. మరి చూడాలి ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎవరు వీడనున్నారో..!