Asianet News TeluguAsianet News Telugu

' మైఖేల్', 'బుట్టబొమ్మ', 'పద్మ భూషణ్'.. ఏది హిట్ ?, ఏది ఫట్ ?

సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

This week boxoffice New releases result
Author
First Published Feb 8, 2023, 8:08 AM IST

ఈ వారం థియేటర్లలో మూడు కాన్సెప్టు ఓరియెంటెండ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అవి   సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం మైఖేల్, సుహాస్ రైటర్ పద్మభూషన్ ,అనిక సురేంద్రన్ అర్జున్ దాస్ సూర్య వశిష్ట కీలకపాత్రల్లో చేసిన బుట్టబొమ్మ . ఈ మూడు చిత్రాల్లో సుహాస్ రైటర్ పద్మభూషన్ మాత్రమే కాస్త పైచేయి చూపిస్తోంది. మిగతా రెండు సినిమాలకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది.

సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మైఖేల్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.  మంచి పబ్లిసిటీతో వచ్చిన మైఖేల్  బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ కమ్ బ్యాక్ హిట్ కొడతారని అందరూ ఆశించగా.. తొలి ఆట నుంచే టాక్ ఘోరంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . సందీప్ కిషన్ మైఖేల్ లో గౌతమ్ మీనన్, అనసూయ, వరుణ్ సందేశ్ లతో పాటు విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి నటీనటులతో వచ్చిన మైఖేల్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ అయింది. కానీ ఏ ఒక్క చోటా సినిమాకి సానుకూల స్పందన రాలేదు.

 బుట్టబొమ్మకు కూడా అదే పరాభవం ఎదురయింది.   బుట్టబొమ్మ 2020లో విడుదలైన మలయాళ హిట్ కప్పెలాకు రీమేక్ గా తెరకెక్కింది. పరస్పరం ఎప్పుడూ కలవని ఒక ఆటోడ్రైవర్, పల్లెటూరి అమ్మాయికి మధ్య జరిగే ఫోన్ కాల్ రొమాన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వారి జీవితం లోకి మరో వ్యక్తి ప్రవేశించినపుడు ఎదురైన సంఘటనల సమాహారం ఈ చిత్రం కథ.   సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ సినిమాస్ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘బుట్టబొమ్మ’. కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టీ రమేష్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది.

ఇక సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని లహరి ఫిల్మ్స్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. సుహాస్ కు జోడీగా టీనా శిల్పరాజ్ నటించారు. ఈ మూడు సినిమాల్లో  బాక్స్ ఆఫీస్ వద్ద రైటర్ పద్మభూషన్ పర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో పద్మభూషణ్ అనే మధ్యతరగతి యువకుడిగా సుహాస్ కనిపించగా, ఆశిష్ విద్యార్థి, రోహిణి అతని తల్లిదండ్రులుగా నటించారు.  3 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ .5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం సుహాస్ కెరీర్ బెస్ట్ కలెక్షన్లను నమోదు చేసిందని చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios