శవం ముందు జాగారం చేసే సమయంలో.. పాటలు పాడుకోవడం, కాకి పిండం ముట్టకపోతే.. కుటుంబ ఘనతను, బాధ్యతలూ చెప్పటం వంటివి కనిపిస్తాయి.
చాలా సార్లు ప్రాంతీయ మూలాలు నేపధ్యంగా తీసుకున్న కథల్లో ఓ విధమైన సహజత్వం తొణికిసలాడుతూంటుంది. ఆ తరహా కథలతో సినిమాలు తీస్తే జీవం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు ఇప్పుడు తెలంగాణా నుంచి వస్తున్న దర్శకులు చేస్తున్నారు. చిన్న సినిమాలకు తమ ప్రాంతపరిమళాన్ని అద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు తడబడినా నిలబడుతున్నారు. దాదాపు 'బలగం' అలాంటి ప్రయత్నమే. ఈ సెల్ ఫోన్ యుగంలో ఇలాంటి కథలు ఇంకా జరుగుతున్నాయా అనే ప్రశ్న ఉదయించకపోతే... తెలంగాణలోని మారుమూల పల్లెటూళ్లో మనుషుల మధ్య బంధాలు, గొడవలను, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని బలగం’ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజై మంచి రివ్యూలు తెచ్చుకుంది. అయితే థియేటర్ కు వెళ్లి చూడని కొందరు ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని Amazon Prime Video మంచి రేటు ఇచ్చి సొంతం చేసుకుంది. మెల్లి మెల్లిగా మౌత్ టాక్ జనాల్లోకి వెళ్తున్న ఈ చిత్రం ఒక నెల తర్వాత ఓటిటిలోకు వస్తుందని సమాచారం. ఇక ఈ చిత్రం చేసినందుకు దిల్ రాజుకు మంచి ప్రశంసలు తెలంగాణా సమాజం నుంచి వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి కథతో సినిమా చేయడం మాత్రం సాహసమే. శవం ముందు జాగారం చేసే సమయంలో.. పాటలు పాడుకోవడం, కాకి పిండం ముట్టకపోతే.. కుటుంబ ఘనతను, బాధ్యతలూ చెప్పటం వంటివి కనిపిస్తాయి. తెలంగాణ సంస్కృతిలో పెరిగిన వాళ్లకు ఆయా సన్నివేశాలన్నీ హృదయాన్ని తాకే అవకాశం ఉంది. అలాగే ఇదే డైరక్టర్ వేణు కు ఆయన తన బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్టు ఇచ్చినట్లు సమాచారం.
ఇంతకీ ఈ చిత్రం కథేమిటంటే..
కొమురయ్య (సుధాకర్‌రెడ్డి) తాతకి ఊరంతా భారీ బంధువర్గం ఉన్నా మానసికంగా ఒంటరి. ఏదో అవేదనతో ఉంటాడు. దాన్ని కప్పెట్టి వయస్సు తో సంభందం లేకుండా ఊళ్లో అందరితో పరాచికాలు ఆడుతూ, అవసరమైతే మందలిస్తూ, నవ్విస్తూ..నవ్వుతూ లైఫ్ ని ఈజీగా తీసుకుని బ్రతుకు సాగిస్తూంటాడు. అతని కొడుకులు ఐలయ్య, మొగిలయ్యలు. అలాగే ఓ కూతురు లక్ష్మి. ఈ కూతురు,ఆమె భర్త అంటే కొడుకులకు గిట్టదు. ఎప్పుడూ ఏవో గొడవలు జరుగుతుంటాయి. ఇదిలా ఉంటే ఐలయ్య కొడుకు సాయిలు(ప్రియదర్శి) అప్పుల్లో మునిగిపోతాడు. సొంతం వ్యాపారం చేసి ఎదగాలని చివరకు ఉన్న ఎకరం భూమిని సైతం అమ్మేస్తాడు. అప్పులు మిగిలుతాయి. దాని నుంచి బయిటపడాలంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. 15 లక్షలకు ఓ సంభందం సెట్ చేసుకుని పెళ్లి పీటలకు ఎక్కడానికి రెడీ అవుతాడు.
రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్. ఈ లోగా తాత చచ్చిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది..తను అప్పులు ఎలా తీరుస్తాడు అనే బెంగలో ఉండగా...తన తాత ని చూడటానికి తన మేనత్త కూతురు,మరదలు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) వస్తుంది. ఆమెను లైన్ లో పెట్టి పెళ్లి చేసుకుంటే పెద్ద ఆస్తి సొంతమై ఒడ్డున పడిపోతాడనే ఆశ మళ్లీ చిగురిస్తుంది. ఆ ప్రయత్నాలు మొదలెడతాడు. అయితే ఈ లోగా ఇంట్లో ఓ సమస్య వస్తుంది..తాతకు పెట్టిన పిండం కాకి ముట్టడం లేదు..ఎందుకిలా జరుగుతోంది. తాత చచ్చి ఏం సాధించదలుచుకున్నాడు.... కొమురయ్య మనస్సులో ఏముంది...సాయిలు కు పెళ్లి అయ్యిందా..అప్పులు తీరాయా... చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
