ఇంటిలో మిత్రులుగా ఉన్న అమ్మ రాజశేఖర్, అఖిల్ మధ్య వాడి వేడి వాగ్వాదం నడిచింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యుల బొమ్మలతో కూడిన టైల్స్ ఏర్పాటు చేశారు. కారణాలు చెవుతూ ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా తమకు నచ్చని వారి ఫోటో ఉన్న టైల్ సుత్తితో పగలగొట్టి నామినేట్ చేయాల్సి వుంది. ఈ ప్రక్రియలో మోనాల్, అభిజిత్ తో మాట్లాడపోవడాన్ని కారణం చూపుతూ అమ్మ రాజశేఖర్...అఖిల్ ని నామినేట్ చేశాడు. 

అమ్మ రాజశేఖర్ చెప్పిన కారణానికి అఖిల్ హర్ట్ అయ్యారు. అభిజిత్ తో  మోనాల్ మాట్లాడాపోతే నాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అభితో మాట్లాడ వద్దని నేను ఎప్పుడూ మోనాల్ కి చెప్పలేదని అన్నాడు. ఈ సంఘటనల వలన మా పేరెంట్స్ కూడా బాధపడుతుంటారని సీరియస్ అయ్యాడు. దానికి ఎవరికి లేరు పేరెంట్స్ అని అమ్మ రాజశేఖర్ కూడా సీరియస్ అయ్యాడు. 

ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియలో మెహబూబ్, ఆరియానా మధ్య గొడవ జరిగింది. అలాగే ఎనిమిది వారాల తరువాత మొదటిసారి మోనాల్ ని నామినేట్ చేసిన అభిజిత్...ఆమె ప్రవర్తనను తప్పుబట్టారు. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ ప్రోమో ఈ అంశాలతో కూడుకొని ఉన్న నేపథ్యంలో సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగిపోతుంది.