చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల నారప్ప చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. ఆయన గత చిత్రం బ్రహ్మోత్సవం 2016లో విడుదలైంది. మహేష్ హీరోగా భారీ క్యాస్ట్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.  

వెంకీ-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కిన నారప్ప ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. జులై 20న అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కాగా చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల నారప్ప చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. ఆయన గత చిత్రం బ్రహ్మోత్సవం 2016లో విడుదలైంది. మహేష్ హీరోగా భారీ క్యాస్ట్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 


దీనితో శ్రీకాంత్ కెరీర్ ఒక్కసారిగా కిందపడిపోయింది. మరో మూవీ చేయడానికి ఆయనకు ఐదేళ్ల సమయం పట్టింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ పట్ల మహేష్ అభిప్రాయం వింటే మాత్రం షాక్ కావలసిందే. బ్రహ్మోత్సవం మూవీ ప్రమోషన్స్ సమయంలో శ్రీకాంత్ గురించి మాడ్లాడుతూ.. ఆయన చాలా జెన్యూన్, సింపుల్ అని మహేష్ కొనియాడారు. కనీసం కారు కూడా లేని శ్రీకాంత్, చాలా సాధారణ వ్యక్తిలా బైక్ పై తిరుగుతారని తెలిపారు. ఇక శ్రీకాంత్ మూవీలోని పాత్రలు, సన్నివేశాలు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి, అవును మన లైఫ్ లో ఇలా జరిగింది కదా అనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చూసిన చాలా మంది, మా అన్నదమ్ములు మధ్య అనుబంధం ఇలానే ఉంటుంది, అని చెప్పారని , మహేష్ గుర్తు చేసుకున్నారు. 

వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయాన్ని అందుకుంది. పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ విజయం సాధించడంతో, అదే జోనర్లో బ్రహ్మోత్సవం మూవీ చేశారు మహేష్, శ్రీకాంత్. బ్రహ్మోత్సవం తెలుగు టీవీ సీరియల్ కంటే దారుణం అంటూ అప్పట్లో అనేక విమర్శలు రావడం జరిగింది.